అన్నీ షాకులే: గాయంతోనే హీరో రామ్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
హైదరాబాద్: ఎనర్జిటిక్ హీరో రామ్, కృతి కర్బంద జంటగా నటిస్తున్న 'ఒంగోలు గిత్త' చిత్రం రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగులో గాయపడ్డ రామ్ కాలికి కట్టుతోనే ఈ రోజు ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ "ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అన్నీ షాకులు తగులుతున్నాయి. టైటిల్, మిర్చి యార్డ్, ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్. బొమ్మరిల్లు భాస్కర్ 'ఒంగోలు గిత్త' సినిమాకు A సర్టిఫికెట్ ఏమిటని అందరూ కన్ఫ్యూజ్ అయి షాక్ అయ్యారు. ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా" అని వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ...'సినిమాను ఎంతో కూల్ గా పూర్తి చేసాను. బొమ్మరిల్లు సినిమా సమయంలో కూడా ఇంత కూల్ గా లేను. 'ఒంగోలు గిత్త' అనేది మంచి ఎంటర్ టైన్మెంట్ ప్యాకేజ్. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో న్యూడ్ గా ఓ సన్నివేశం చేయాల్సి వచ్చింది. బొమ్మరిల్లు సినిమా తర్వాత రొటీన్ గా వెలుతున్న నేను కిక్ కోసం ఈ సినిమా చేసాను' అని వెల్లడించారు.

ఒంగోలు గిత్త ప్రెస్ మీట్

ఒంగోలు గిత్త ప్రెస్ మీట్

ఒంగోలు గిత్త ప్రెస్ మీట్

ఒంగోలు గిత్త ప్రెస్ మీట్

ఒంగోలు గిత్త ప్రెస్ మీట్లో కాలికి గాయంతో రామ్.
రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications











