రామ్ ‘ఒంగోలు గిత్త’ రిలీజ్ డిటేల్స్
హైదరాబాద్: దేవదాసు, రెడీ, మస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ వంటి హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒంగోలు గిత్త' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ 'ఒంగోలు గిత్త షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చక్కని ప్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుదన్న నమ్మకం నాకుంది' అన్నారు.
బొమ్మరిల్లు పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్క్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. కమర్షియల్ గా ఈచిత్రం మా అంచనాలను అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.
రామ్, అజయ్, రఘుబాబు, రమా ప్రభ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి.రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications












