రవితేజను ఒంగోలు గిత్తలా ఢీకొడుతున్న రామ్

By Bojja Kumar

హైదరాబాద్ : 'ఒంగోలు గిత్త' చిత్రంలో నటిస్తున్న ఎర్జిటిక్ హీరో రామ్ టైటిల్‌కి తగినట్లుగానే ఒంగోలు గిత్తలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజతో ఢీ అంటే ఢీ అంటున్నాడు. రవితేజ 'సార్ వచ్చారు' చిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్ధం అవుతుండగా...అదేరోజు బాక్సాఫీసు బరిలోకి దూకుతున్నాడు రామ్.

రామ్ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా.బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమా ప్రభ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రవితేజ-కాజల్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సార్ వచ్చారు' చిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X