రామ్ 'ఒంగోలు గిత్త' విడుదల తేదీ ఖరారు
నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ ''మార్కెట్ వాతావరణంలో వచ్చే సన్నివేశాలు, రామ్ నటన ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వినోదంతోపాటు, యాక్షన్ అంశాలకీ పెద్ద పీట వేశాం. కథరీత్యా 'ఒంగోలు గిత్త' అనే పేరు అతికినట్లు సరిపోతుంది. . ఫ్యామిలీ టచ్‌తో ఉండే మాస్ ఎంటర్‌టైనర్. రామ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. త్వరలో ఆడియో విడుదల వివరాలు ప్రకటిస్తాము. క్రిస్మస్ కి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం''అన్నారు.
సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోంది. డిసెంబర్లో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.
రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications












