సింగం-3.... సరికొత్త రికార్డ్, 99 శాతం వేస్టేనంట!

సూర్య నటించిన సంగం-3 చిత్రం రిలీజ్ కాక ముందే ఎవరూ ఊహించని రికార్డ్ నెలకొల్పింది. అసలు ఇలాంటి రికార్డు ఒకటి ఉంటుందా? అని ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఆ రికార్డు ఎందులో తెలుసా? వేస్టేజీలో...,

By Bojja Kumar

హైదరాబాద్: సూర్య నటించిన సంగం-3 చిత్రం రిలీజ్ కాక ముందే ఎవరూ ఊహించని రికార్డ్ నెలకొల్పింది. అసలు ఇలాంటి రికార్డు ఒకటి ఉంటుందా? అని ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఆ రికార్డు ఎందులో తెలుసా? వేస్టేజీలో..., మీరు విన్నది నిజమే, సినిమా షూటింగులో 99 శాతం వేస్టేజీగా మిగిలి పోయిందట.

ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర దర్శకుడు హరి వెల్లడించారు. సినిమా షూటింగ్ కోసం షూట్ చేసిన సీన్లలో 99.2 శాతం ఎడిటింగులో తీసేసారట. కేవలం 0.8శాతం మాత్రమే రెండున్నర గంటల సినిమాగా మన ముందుకు వచ్చిందట.

Only 0.88% shooting footage used for S3

సినిమా కోసం మొత్తం 17 లక్షల రోల్స్ షూట్ చేయగా... ఎడిటింగ్ తర్వాత కేవలం 14 వేల రోల్స్ మాత్రమే 'సింగం 3'గా విడుదల చేసారు. అయితే ఇందులో ఉపయోగించని ఆ సీన్లను సింగం 4, సింగం 5 ల్లో ఉపయోగిస్తామని దర్శకుడు వెల్లడించారు.

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలంది. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలను మించి ప్రీరిలీజ్ కే 100 కొట్ల బిజినెస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ చిత్రం స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌ల‌ై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X