ఫస్ట్ డే ఫస్ట్ షో.. 11 టికెట్స్ మాత్రమే.. అదుగో పరిస్థితి ఇది!
Recommended Video

హాస్య నటుడిగా, విలన్ గా, దర్శకుడిగా రవి బాబు మల్టి టాలెంట్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రవిబాబు వేసే కామెడీ విలన్ వేషాలు ముచ్చటగా ఉంటాయి. రవిబాబు అల్లరి చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా పలు చిత్రాలు తెరకెక్కించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ కలిగిన చిత్రాలు తెరకెక్కిస్తాడనే గుర్తింపు రవిబాబుకి ఉంది. తాజాగా రవిబాబు తెరకెక్కించిన చిత్రం అదుగో.

పంది పిల్లతో సందడి
గత కొన్ని నెలల నుంచి రవిబాబుకి సంబంధించిన ఏవార్త వచ్చినా పక్కనే ఓ పంది పిల్ల కూడా కనిపిస్తూ వస్తోంది. పంది పిల్లని పెట్టి రవిబాబు అదుగో అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో అందరికి ఆసక్తి నెలకొంది. పందిపిల్లతో సినిమా ఏంటని అందరూ ఆ చిత్రం గురించి ఆరా తీశారు.

11 టికెట్స్ మాత్రమే
ఓ మోస్తరు సినిమా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఐమాక్స్ లో టికెట్స్ దొరకడం కష్టం. కానీ మంచి ప్రమోషన్స్ నిర్వహించినా కూడా అదుగో సినిమా పరిస్థితి దారుణంగా మారింది. ఐమాక్స్ తో తొలిరోజు తొలి షోకు కేవలం 11 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాట. దీనితో డిస్ట్రిబ్యూటర్స్ లబోదిబో మంటున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్
ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు వెన్నుదన్నుగా నిలిచినా సినిమాని కాపాడలేకపోయారు. సినిమాని క్వాలిటీతో తెరకెక్కించినప్పటికీ ఆడియన్స్ కు ఏమాత్రం రుచించని కథ కావడంతో అదుగో సినిమాపై ఆసక్తి చూపడంలేదు. ఏదో అనుకుని రవిబాబు చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టిందని క్రిటిక్స్, ఆడియన్స్ అభిప్రాయ అపడుతున్నారు.

మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా
రవిబాబు తన కథ కథనంతో ఆడియన్స్ కు అద్భుతమైన వినోదాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా పూర్తిగా నిరాశపరిచిన చిత్రాలు కూడా ఉన్నాయి. మనసారా, నచ్చావులే లాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications











