'జంజీర్‌' కి సంజయ్ దత్ షూట్ బ్యాలెన్స్ ఎన్ని రోజులంటే

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌'. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో సంజయ్ దత్ చేస్తున్నారు. అయితే ఆయనకి రీసెంట్ గా జైలు శిక్ష పడటంతో అంతా కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో సంజయ్ దత్ వలన 'జంజీర్‌' కి నష్టం ఏ మేరకు ఉండబోతోందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే కేవలం మూడు రోజులు మాత్రమే సంజయ్ దత్ తో చెయ్యాల్సిన షూట్ బ్యాలెన్స్ ఉందని రామ్ చరణ్ తేల్చి చెప్పారు.

దర్శకుడు అపూర్వ లఖియా ఈ విషయమై మాట్లాడుతూ...''గురువారం నుంచి సంజయ్‌ మా చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టారు. మూడు రోజులపాటు నటించాల్సి ఉంది. అది త్వరలోనే పూర్తవుతుంది''అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. '' సంజయ్ దత్ కి ఇలా జరగటం విచారకరమైన విషయం. మా చిత్ర బృందం ఆయనకు అండగా ఉంటుంది''అన్నారు.

''నాన్న పేరు నిలబెట్టడమే కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో అమితాబ్ లాంటి లెజండ్ చేసిన పాత్ర ద్వారా బాలీవుడ్‌లోకి ఎంటరవ్వడం అవసరమా? అనిపించి అపూర్వ లఖియాకు చేయనని చెప్పేశాను. మళ్లీ ఎనిమిది నెలల తర్వాత తనొచ్చి 'ఇది 'జంజీర్' రీమేక్ అన్న సంగతి మరిచిపో. ఓ కొత్త సినిమా అనుకొని చేద్దాం' అని నచ్చజెప్పచూశాడు. ఆ సమయంలోనే 'ఇష్టం లేకపోతే చేయొద్దు. అలాగే భయంతో పని మానొద్దు' అన్న నాన్న మాట గుర్తొచ్చింది. వెంటనే 'ఓకే' చెప్పేశాను. కసితో పని చేశాను. అందరికీ నచ్చుతుందని నా నమ్మకం'' అని రామ్ చరణ్ అన్నారు.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ''హైదరాబాద్‌ ఎప్పుడొచ్చినా సరే చరణ్‌ దంపతులు నన్ను సొంత మనిషిలా చూసుకొన్నారు. తెలుగులో ఇంతకు ముందు 'అపురూపం' అనే చిత్రం చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది''అన్నారు. 'జంజీర్‌' తెలుగులో 'తుఫాన్‌'గా రాబోతోంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్. శ్రీహరి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. అపూర్వ లాఖియా దర్శకత్వం వహించారు. 'తుఫాన్‌' ప్రచార చిత్రాలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించారు.

చిరంజీవి మాట్లాడుతూ ''నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి పదమూడేళ్లు పట్టింది. చరణ్‌ కథానాయకుడైన మూడోయేటే హిందీ సినిమా చేశాడు. అందుకే కాస్త గర్వంగా ఇంకాస్త ఈర్ష్యగా ఉంది. తండ్రిని మించిన తనయుడు అని చరణ్‌ ప్రతిసారీ నిరూపించుకొంటూనే ఉన్నాడు. 'తుఫాన్‌'లో కొన్ని సన్నివేశాలు చూశా. దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. ఓ కమర్షియల్‌ సినిమాకి ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. విందు భోజనంలా ఉండబోతోంది. 'రచ్చ', 'నాయక్‌'ల తరవాత చరణ్‌ హ్యాట్రిక్‌ సాధిస్తాడు''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X