చిత్ర నిర్మాణంపై కీర్తీ సురేశ్ ఆసక్తి, క్లారిటీ ఇచ్చేసిన అమ్మడి టీమ్
కోలవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ టాప్ హీరోలందరూ కీర్తీ డేట్ల కోసమే ఎదురుచూస్తున్నారు. అందం, అభినయం కలబోసిన నటీమణులు దొరకడం కష్టమవుతున్న ఈ కాలంలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ అన్నీ కీర్తి ఇంటి ముందు క్యూ కట్టేస్తున్నాయి. దీంతో అమ్మడు చేతి నిండా సినిమాలతో మస్త్ బీజీగా ఉందన్న సంగతి తెలిసిందే.
అయితే, లాక్ డౌన్ వేళ కాస్త గ్యాప్ దొరకడంతో, అమ్మడు చిత్ర నిర్మాణంలోనూ అడుగుపెట్టాలని భావిస్తోందని మాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్త ఇక్కడి వరకూ రావడంతో, అందరూ నిజమేననుకున్నారు. త్వరలోనే కీర్త నిర్మాతగానూ మారుతుందని, ఇప్పటికే ఓ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందన్న కబురు అంతటా వ్యాపించింది. అయితే, అసలు కథ వేరే అని కాస్త ఆలస్యంగా తెలిసింది.

ఇంతకూ విషయం ఏమిటంటే, ప్రస్తుతం కీర్తికి నటనపై తప్పా మరేదానిపైనా ఆసక్తి లేదని, ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణంపై ఆమెకు అసలే ఆసక్తి లేదని, కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని తేల్చిపారేసింది. ప్రస్తుతం ఆమె నటించిన గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి. మరోవైపు, అమ్మడు ఇతర షూటింగ్ లతోనూ బిజీ బిజీగా ఉంటోంది.
ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న కీర్తి, ఇక్కడ ఓ షూటింగ్ లో పాలుపంచుకుంటోంది. మరోవైపు అన్నాత్తే సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెల్లెలుగానూ కనిపించబోతోంది. ఇన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న కీర్తి, చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించి రెండు పడవలపై ప్రయాణం చేయదలచుకోలేదని స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











