»   » పిచ్చిగా ఊహించుకోవద్దు: ట్వీట్‌తో షాకిచ్చిన రేణు దేశాయ్ !

పిచ్చిగా ఊహించుకోవద్దు: ట్వీట్‌తో షాకిచ్చిన రేణు దేశాయ్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే 'ఖుషి-2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా సహ నిర్మాత వ్యవహరిస్తుందని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇందుకు సంబంధించిన వార్త తెలుగు మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయినా..... మళ్లీ ఇలా దగ్గరవుతున్నారని ఫ్యాన్స్ సంబర పడ్డారు. అయితే తాజాగా చేసిన ఓ ట్వీట్ తో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది రేణు. ఆమె ట్వీట్ లో 'ఖుషి-2' ప్రస్తావన లేక పోయినా.... ఆమె ఉద్దేశ్యం మాత్రం ఆ సినిమా గురించే అని అంటున్నారు.

షాకింగ్ ఇన్సిడెంట్: కమెడియన్‌ను కొట్టిన పవన్ కళ్యాణ్?

'నాకు సంబంధించిన ఏ విషయం అయినా... నేను ట్విట్టర్ ద్వారా తెలుపుతాను. నేను చెప్పకుండా... నా గురించి ఏదైనా వార్తలు వస్తే అది నిజం కాదు... పిచ్చి ఊహాగానాలు మాత్రమే' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు .

మీడియాలో ఇలా ప్రచారం....
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'ఖుషి' సీక్వెల్ చేస్తున్నారని, ఈ సినిమాకు రేణు దేశాయ్ నిర్మాతగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య తరచూ దర్శకుడు ఎస్.జె.సూర్య, సంగీత దర్శకుడు అనూపర్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు.

ఈ ఇద్దరూ కలిసి ముంబై వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారని..... రేణు దేశాయ్ కూడా పూణె నుండి ముంబై వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారని టాక్. ఈ సినిమా విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాకపోయినప్పటికీ తెర వెనక జరిగే పనులు చకచకా జరిగిపోతున్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రేణు దేశాయ్ ఇటీవల చేసిన కొన్ని ట్వీట్ష్ స్లైడ్ షోలో....

పిచ్చి ఊహలు వద్దు

పిచ్చి ఊహలు వద్దు అంటూ రేణు దేశాయ్ అభిమానులకు గట్టిగా షాకచ్చింది.

కూతురు గురించి చేసిన ట్వీట్

తన కూతురు గురించి రేణు దేశాయ్ చేసిన ట్వీట్ ఇది...

కొడుకు గురించి..

తన కొడుకు అకీరాకు అందిన కొన్ని మంచి మాటలు...

ఫుట్ బాల్

ఫుట్ బాల్

English summary
"Hello all :) Only if I tweet it here it's true, rest all is the crazy imagination of crazier beings" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu