twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు: గిరిబాబు కామెంట్

    |

    Recommended Video

    Actor Giribabu About Jr NTR || ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను గెంటేస్తారు

    తెలుగు సినీ ప్రముఖుడు, 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రామారావుతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు... తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని చేశారు.

    ఎన్టీ రామారావు గురించి గిరిబాబు మాట్లాడుతూ... ఆయన చాలా సిన్సియర్, డెడికేటెడ్ మ్యాన్. రియల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉండేవారు. సెట్లో ఆయన యాక్ట్ చేస్తున్నపుడు ఏం గిరి.. నేను చేసింది బావుందా? అని అడిగేవారు, అలా అడగటం ఎంత గొప్పవిషయం. ఆయన సాధించని విజయం లేదు, అన్నీ సాధించారని చెప్పుకొచ్చారు.

    వంద సంవత్సరాలైనా వారిని బీట్ చేసేవారు రారు

    వంద సంవత్సరాలైనా వారిని బీట్ చేసేవారు రారు

    పౌరాణికాల్లో ఒక నారదుడు తప్ప ఎన్టీ రామారావు అన్ని పాత్రలు వేశారు. జానపదాల్లో చాలా పాత్రలు వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు. వంద సంవత్సరాలైనా వారి ఇమేజ్ బీట్ చేసేవారు రారు, రాలేరు. వారిని చూసే మాలాంటివారమంతా సినిమాల్లోకి వచ్చాం.

    అది రామారావు కర్మ, దురదృష్టం

    అది రామారావు కర్మ, దురదృష్టం

    మరో ప్రశ్నకు గిరిబాబు సమాధానం ఇస్తూ.... ఎన్టీఆర్ చివరి దశలో ఉన్నపుడు మేము చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మేము ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలం కాదు. రాజకీయ పరిణామం వాళ్ల బంధువర్గంలోనే జరిగిపోయింది. అది కర్మ... దురదృష్టం. అంత వెలుగు వెలిగిన మహానుభావుడు చివరకు అంత దారుణమైన స్థితికి పడిపోవడం అనేది శోచనీయమైన విషయం. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది, అది మరిచిపోవడానికి మామూలు విషయం కాదు.

    ఇరిటేట్ చేస్తే బాలయ్యకేంటి... నాకైనా కోపం వస్తుంది

    ఇరిటేట్ చేస్తే బాలయ్యకేంటి... నాకైనా కోపం వస్తుంది

    బాలకృష్ణ నన్ను అన్నయ్య అన్నయ్య పిలుస్తుంటాడు. ఆయనతో చాలా సినిమాలు తీశాను. బాలయ్యకు బాగా కోపం, అందరినీ సెట్లో కొడుతుంటారు అనేది నిజం కాదు. ఎవరినైనా ఇరిటేట్ చేస్తే కోపం రావడం సహజం. ఇరిటేట్ చేస్తే నాకు మాత్రం కోపం రాదా? అలాగే బాలకృష్ణకు వస్తుంది.

    మంచి మంచి సిగరెట్లు కాల్చేవారం

    మంచి మంచి సిగరెట్లు కాల్చేవారం

    మేము చాలా సార్లు కలిసి ఉండేవారం. ఎప్పుడైనా ఫారిన్ షూటింగుకు వెళితే మంచి మంచి సిగరెట్లు కాల్చేవారం. సపరేటుగా షాపింగుకు వెళ్లి నాకు అవి పంపించేవారు. బ్రదర్ ఎలా ఉంది అని ఫోన్ చేసేవారు. మా మధ్య అంత సాన్నిహిత్యం ఉండేది.

    ఇపుడు తెలుగు దేశం పార్టీలో లేను

    ఇపుడు తెలుగు దేశం పార్టీలో లేను

    రామారావు ఉన్నపుడు తెలుగు దేశం పార్టీలో పని చేశాను. కానీ ఇపుడు వైసీపీలో ఉన్నాను. 2009లోనే రాజశేఖర్ రెడ్డి వైపు వచ్చాను. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నాను. ప్రజల కష్టాలు జగన్ తెలుసుకున్నాడు, అవి పోగొడతాడనే నమ్మకంతో గెలిపించారు. వైఎస్ఆర్, జగన్ ఇద్దరూ గ్రేట్ పీపుల్. రామారావుగారి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మనకు కనిపిస్తున్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి.

    మరో పదేళ్లు ఆయనే అధికారంలో ఉంటాడు

    మరో పదేళ్లు ఆయనే అధికారంలో ఉంటాడు


    5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు... ఓడిపోయామనే ఉక్రోశం పట్టలేక జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. తర్వాత 5 ఏళ్లు కూడా వారు అధికారంలోకి రాలేదు. మరో 10 నుంచి 15 సంవత్సరాలు జగనే ఉంటాడు.

    జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు

    జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు


    తెలుగు దేశం పార్టీ బ్రతికి బట్టకట్టడం అనేది ఇప్పట్లో కష్టం. ఆ పార్టీ మళ్లీ బ్రతికి బట్టకట్టాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే జూనియర్ ఎన్టీఆర్... ఈ విషయం నేను గతంలోనే చెప్పాను. ఆయన్ను పార్టీలోకి రానీయకుంటే జనం వారిని బయటకు పంపుతారు.... అంటూ గిరిబాబు వ్యాఖ్యానించారు.

    English summary
    "Only Junior NTR has the ability to save the Telugu Desam Party. If he is prevented from coming into the party, the people will be taught a proper lesson." senior actor Giribabu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X