నందమూరి బాలయ్య ఒక్కడే బ్యాలెన్స్!
సినిమాను ఎంటర్ టైన్ మెంట్ వేలో ప్రజెంట్ చేసి సూపర్ హిట్ చేస్తుంటారు దర్శకుడు శ్రీనువైట్ల. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో 'నమో వెంకటేశ" చిత్రాన్ని తీస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన మహేష్ బాబును డైరెక్ట చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. దర్శకుడిగా శ్రీనువైట్ల అగ్ర హీరోల చిత్రాలు ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నాడు. మొదట 'అందరివాడు" గా చిరంజీవిని మలచి కౌంట్ డౌన్ కు శ్రీకారం చుట్టాడు. తర్వాత నాగార్జునతో 'కింగ్" అనంతరం వెంకటేష్ తో 'నమో వెంకటేశ". ఒక్క బాలకృష్ణ మినహా అందరి అగ్ర హీరోలను డైరెక్ట్ చేశాడు. తాజాగా అగ్ర యువ హీరోలను ఎంచుకుని తొలి ప్రయత్నంగా మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు. అగ్ర హీరోల మాదిరి వరుసగా యంగ్ స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేస్తూ బ్యాలెన్స్ వున్న బాలయ్యను కూడా డైరెక్ట్ చేసి 'అందరివాడు" అనిపించుకుంటాడేమో చూడాలి మరి!


Click it and Unblock the Notifications











