నా దృష్టిలో సూపర్ స్టార్స్ వాళ్లిద్దరే: గణేష్

By Srikanya

నా దృష్టిలో సూపర్‌స్టార్‌ అంటే రజనీకాంత్‌. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌. ఈ మాట అంటోంది నేటి విజయాన్ని చూసి కాదు. వ్యక్తిగతంగా పవన్‌లోని నిబద్ధత, విలువలను దగ్గరగా చూసినవాడిగా అంటున్నా. తన సినిమా రికార్డులు సాధించింది అని చెప్పుకోవడం పవన్‌కు ఇష్టం ఉండదు. ప్రతిదానికీ ప్రచారానికి ముందుకిరారు. 'పవన్‌ ఓ సపరేట్‌ పీస్‌. ఆ పీస్‌ మళ్లి మాన్యుఫ్యాక్చర్‌ కాదు' అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత గణేష్ బాబు. గణేష్ బాబు తాజా చిత్రం గబ్బర్ సింగ్ హిట్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు.

అలాగే.. రజనీకాంత్‌ కామెంట్‌ గురించి చెబుతూ..' సినిమాను ఆయన చూసి మెచ్చుకున్నారు. ట్విట్టర్‌లో కూడాపెట్టారు. చాలా ఎంజాయ్ చేశామన్నారు. నా దృష్టిలో ఒక రజనీకాంత్‌. ఒక పవన్‌కళ్యాణ్‌. ఆయన ఎంత మంచివాడో దగ్గరగా ఉన్న నాకు తెలుసు. దూరంగా ఉన్నవారు ఆయన గురించి ఏవోవో అనుకుంటుంటారు. దానధర్మాల విషయంలో ఆయనకు ఆయనే సాటి' అని పేర్కొన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుతూ...' ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే.. దానికి తిరుగుండదు. తీన్‌ మార్‌ తీసి నష్టపోయిన నాకు ఇచ్చారు. పిలిచి సినిమా తీయమన్నారు. గబ్బర్‌సింగ్‌ ఆయన బ్యానర్‌లో తీయాల్సి ఉన్నా... ఆ అవకాశం నాకు రావడం అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా లేకుంటే గణేష్‌ అనేవాడు లేడు' అని అన్నారు.

నేడు పరిశ్రమ రికార్డులను తిరగరాసే దిశగా 'గబ్బర్‌సింగ్‌' విజయం సాధించింది. గబ్బర్‌ సింగ్‌ ప్రభావమే ఐపిఎల్‌పై పడింది. తెలుగు, తమిళ్‌, ముంబై అన్నిచోట్లా ఈ సినిమా గురించే చర్చ. అన్నిచోట్లా పెద్ద విజయం సాధించింది. ముంబై పరిశ్రమ అయితే షేకయింది. హిందీలో వచ్చిన 'దబాంగ్‌' చిత్రం హక్కులను పవన్‌ తీసుకున్నారు. సినిమా చూపించి, ఈ సినిమా చేద్దాం అన్నారు. 'గబ్బర్‌ సింగ్‌' అనే టైటిల్‌ను కూడా ఆయనే సూచించారు. ఈ టైటిల్‌ అనుమతిని 'షోలే' చిత్ర సంబంధికుల నుండి అడిగి తీసుకున్నాం. ఇలా టైటిల్‌ను కొన్న తొట్టతొలి సినిమా మాదే అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X