చాలా మంది రియల్ లైఫ్ విలన్స్ : శేఖర్ కమ్మల
అయితే శేఖర్ కమ్ముల నుంచి ఎప్పుడూ ఇలాంటి సినిమాలే వస్తాయా? మాస్ సినిమాలు రావా? అని ఆయన అభిమానులు చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
మీ దగ్గర నుంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమాలు ఎప్పుడు వస్తాయి అని అడిగిన ప్రశ్నకు శేఖర్ ఖమ్ముల స్పందిస్తూ' నాకు సున్నితమైన మరియు హృదయానికి హత్తుకునే సినిమాలు తీయడం అంటేనే ఇష్టం. మన చుట్టూ చాలా మంది రియల్ లైఫ్ విలన్స్ ఉన్నారు. ప్రస్తుతం క్రైమ్ మరియు మన సాంప్రదాయానికి విలువ ఇవ్వని వారిని రోజూ మన సమాజంలో చూస్తూనే వున్నాం. మళ్ళీ నేను అలాంటివాటిని తెరపై చూపించాలని అనుకోవడం లేదు' ఆయన అన్నారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా గురించి చెబుతూ...''కొంచెం అమాయకత్వం, మరికొంచెం గందరగోళం, ఆహ్లాదం, అనుభూతులు... ఇలా అన్నీ మిళితమైన కథాంశమిది. నా గత చిత్రం 'లీడర్'ని అమాయకత్వంతో తీశాను. సమాజంలో మార్పు వస్తుందనీ, అందరూ మారాలనే ఆవేశపూరితమైన ఆలోచనతో తెరకెక్కించాను. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. నాదైన శైలిలో రావాలని నిర్ణయించుకొన్నాను. అందుకే ఇంత సమయం పట్టింది. కళాశాల నేపథ్యంలో 'హ్యాపీడేస్' సాగుతుంది. ఇది మాత్రం వీధిలో హ్యాపీడేస్‌లా ఉంటుంది. నటీనటుల ఎంపిక కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది"అన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయి రిలీజ్ కు సిద్ధం అవుతుంది.
అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్ సంజీవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులు. చిత్రానికి వనమాలి, అనంత శ్రీరామ్‌లు పాటలు అందించారు. చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి రత్నకుమార్, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: వనమాలి, అనంతశ్రీరామ్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, సంగీతం: మిక్కీ జె.మేయర్.


Click it and Unblock the Notifications












