సంక్రాంతి బరిలో మిగిలింది ఆ ఇద్దరే
ఈ 2012 సంక్రాంతి చాలా హడావిడిగా, చాలా చిత్రాలతో వస్తుందని అంతా భావించారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికే విడుదల చేస్తామని ప్రకటనలు సైతం వచ్చాయి. అయితే చివర నిముషంలో అంతా పోటీలో ఉండకుండా ప్రక్కకు తప్పుకుంటున్నారు. అంతా వెళ్లిపోగా సంక్రాంతి బరిలో మిగిలింది వెంకటేష్, మహేష్ బాబు మాత్రమే. వెంకటేష్ చిత్రం 'బాడీగార్డ్', మహేష్ బాబు చిత్రం 'బిజినెస్‌మేన్' లు మాత్రమే ఈ సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. కారణం థియేటర్స్ కొరత అని చెప్తున్నారు. రెండు రోజుల క్రితం దాకా బాలకృష్ణ 'అధినాయకుడు', రవితేజ'నిప్పు'కూడా సంక్రాంతికే వస్తాయని ప్రచారం జరిగింది. అలాగే సునీల్ చిత్రం 'పూలరంగడు'కూడా సంక్రాంతికి వస్తుందనుకున్నారు. అయితే ఎవరికి వాళ్లు తమ తమ కారణాలతో ప్రక్కకు వెళ్తున్నారు.
ఈ విషయమై 'అధినాయకుడు' నిర్మాత ఎమ్.ఎల్.కుమార్‌చౌదరి మాట్లాడుతూ.. ఈ యేడాది 'అధినాయకుడు' కూడా సంక్రాంతికే రావల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది.''అధినాయకుడు' ఓ ప్రత్యేకమైన చిత్రం. సంక్రాంతి బరిలో నిలపాలని హడావుడిగా తీసుకొచ్చేయలేం. ఇలాంటి సినిమాని ఎప్పుడు తీసుకొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే కాస్త ఆలస్యమైనా ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం'' అని చెప్పారు. ఇక రవితేజ నటించిన 'నిప్పు' కూడా సంక్రాంతికి వచ్చేస్తుందని ముందు నుంచీ చెబుతున్నారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమయ్యాయని నిర్మాత వైవియస్ చౌదరి తెలిపారు. అయితే సునీల్ పూలరంగడు చిత్రం మాత్రం ఇంకా డైలమోలో ఉంది. 'సునీల్ సినిమా అంటే ప్రేక్షకులు నవ్వుకోవడానికే వస్తారని తెలుసు. ఈనెల 6న పాటల్ని విడుదల చేస్తాం. సినిమా ఎప్పుడో ఆ రోజు చెప్పేస్తాం'' అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి.


Click it and Unblock the Notifications











