న్యూస్ రీడర్ ప్రేమ కథ ('ఊహలు గుసగుసలాడే' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : 'అష్టాచమ్మ' చిత్రంతో పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. ఆయన ప్రతిభ గల నటుడు అని ఇండస్ట్రీ తొలి చిత్రంతోనే గుర్తించింది. అయితే ఆయన దృష్టి మొత్తం దర్శకత్వం పై ఉంది. అందుకే ఆయన నటుడుగా తక్కువ సినిమాలు చేస్తూ, ఓ కథని తయారుచేసుకుని దర్శకుడుగా మారారు. కథ పూర్తిగా నమ్మి, కొత్త హీరో,హీరోయిన్స్ తో చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటికి కామెడీ. నవ్వులతో నడిచే ఓ ప్రేమ కధా చిత్రం. ఈ చిత్రం ప్రెంచ్ ప్లే ...Cyrrano De Bergerac నుంచి ప్రేరణ పొంది రాసుకున్నట్లు దర్శకుడు చెప్తున్నారు.

కథలో వెంకీ... అలియాస్ ఎన్.వెంకటేశ్వరరావు(నాగ శౌర్య) తండ్రి న్యూస్ రీడర్. తను కూడా న్యూస్ రీడర్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. టెలీ షాపింగ్ ఎపిసోడ్స్ చేస్తూంటాడు. ఈ సమయంలో అనుకోకుండా తన తాత,అమ్మమ్మలను కలవటానికి డిల్లీ నుంచి వైజాగ్ వచ్చిన ప్రభావతి(రాశి ఖన్నా) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడితాడు వెంకీ. అయితే ప్రభావతి బాగా స్వార్ధపరురాలు. దాంతో ఆమెను ఇంప్రెస్ చేయటం చాలా చాలా కష్టమవుతుంది. ఈ లోగా మరికొంతమంది కథలోకి వచ్చి ఆమెను ట్రై చేయటం మొదలెడతారు. ఇంతకీ ఈ ప్రేమ ప్రయాణం ఓ కొలిక్కి ఎలా వచ్చింది, అక్కడి నుంచి అతడి జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయన్నదే ఈ చిత్రకథాంశం.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.... ''ఎంతో ఇష్టపడి రాసుకొన్న కథను పట్టుకొని దర్శకుడిగా అవకాశమివ్వండీ అంటూ రెండేళ్లపాటు నిర్మాతల చుట్టూ తిరిగాను. అందరూ కథ బాగుందన్నారు కానీ ఎవరూ ముందుకు రాలేదు. కొందరు మొదలు పెట్టేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కథ మీద నమ్మకంతో ప్రయత్నాలు ఆపలేదు. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది'' అన్నారు అవసరాల శ్రీనివాస్‌.

Oohalu Gusagusalade Telugu Movie preview

అలాగే ... '' ఈ కథను చక్కటి తెలుగుదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దాం. దర్శకునిగా తొలి సినిమానే బెస్ట్‌ అనిపించుకోవాలని సాయి కొర్రపాటిగారి బ్యానర్‌లో చేశాను. నా కథకు నిర్మాత బాగా సహకరించారు. ఇందులో నేను ఓ పాత్ర కూడా చేశాను. సినిమాని కీలకమైన మలుపు తిప్పే పాత్ర నాది. నటుడిగా కొనసాగుతూనే దర్శకత్వం చేయాలని ఉంది. రెండింటిలో మాత్రం దర్శకత్వమంటేనే ఇష్టం'' అన్నారు అవసరాల శ్రీనివాస్‌.

పతాకం : సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్
సినిమా : ఊహలు గుసగుసలాడే
నటీనటులు : నాగ శౌర్య, రాశి ఖన్నా , రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు
పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్,
కెమెరా: వెంకట్ సి.దిలీప్,
సంగీతం: కల్యాణి కోడూరి,
నిర్మాత: రజని కొర్రపాటి,
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.
విడుదల తేదీ: 20,జూన్, 2014( శుక్రవారం)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X