సోగ్గాడు ఎఫెక్ట్...2 వేలతో నాగార్జున విశ్వరూపం!

By Bojja Kumar

హైదరాబాద్: సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను నాగార్జున కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యధిక థియేటర్స్ మార్చి 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Oopiri Completes Censor, release on the 25th

ఆయన మాట్లాడుతూ....మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నాగార్జునగారు ఈ చిత్రంలో టోటల్‌గా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌ చేస్తున్నారు. అలాగే 'ఆవారా' కార్తీ, తమన్నా జంట ఈ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌ ని అలరించబోతున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బావుందని ప్రశంసించారు. మార్చి 25న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా 2 వేల థియేటర్లలో ఆంద్రప్రధేశ్, తెలంగాణ, తమిళనాడు , కర్ణాటక, నార్త్ ఇండియా, యు.ఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యు.కె, ఆప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X