»   » గూగుల్ దెబ్బకు సెక్స్ బాంబ్ పూనమ్ పాండే అబ్బ.. అసలు ఏం జరిగిందంటే..

గూగుల్ దెబ్బకు సెక్స్ బాంబ్ పూనమ్ పాండే అబ్బ.. అసలు ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సెక్స్‌బాంబ్ పూనమ్ పాండే వెండితెర మీద హాట్‌ హాట్‌గా కనిపించి అభిమానులను పిచ్చెక్కించిన సంగతి కొత్తేమీ కాదు. అభిమానులకు మరింత చేరువ కావడానికి పూనమ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తనకు సంబంధించిన శృంగార ఫొటోలు, వీడియోలు యాప్ ద్వారా చూడవచ్చని దాని ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది. అయితే యాప్ ద్వారా సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుదామనుకొన్న పూనమ్‌కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ షాకిచ్చింది. అశ్లీల దృశ్యాలు, సమాచారం ఉందనే కారణంతో ఆ యాప్‌పై నిషేధం విధించింది. ఈ యాప్‌ను సోమవారం పూనమ్ ఆవిష్కరించింది.

ఆశ్చర్యం కలిగిస్తున్నది..

ఆశ్చర్యం కలిగిస్తున్నది..

ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో పెద్దలకు మాత్రమే అనే రీతిలో ఉండే ఎన్నో మ్యాగజైన్లు ఉన్నాయి. అయితే అందుకు భిన్నంగా నా యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. గూగుల్ ఎందుకు బ్యాన్ చేసిందో అర్థం కావడం లేదు. కనీసం ఆ యాప్‌లో అసభ్యకరమైన ఫొటోలు పెట్టలేదు. ఈ విషయంపై నా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది.

నా వెబ్‌సైట్ నుంచి..

నా వెబ్‌సైట్ నుంచి..

నా యాప్‌ను గూగుల్ తొలగించింది. కానీ అండ్రాయిడ్ యూజర్లు దిపూనమ్‌పాండే యాప్‌ను నా వెబ్‌సైట్ నుంచి డైరెక్టుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును అని పూనమ్ ట్వీట్ చేసింది. ఈ అంశంపై గూగుల్ ప్రతినిధిని మీడియా వివరణ కోరగా.. వ్యక్తులకు సంబంధించిన యాప్‌లపై మేము స్పందించబోం. కావాలంటే మా సంస్థ నియమ నిబంధనలు పరిశీలించవచ్చును అని సమాధానమిచ్చారు.

15 నిమిషాల్లో 15 వేల డౌన్‌లోడ్స్

15 నిమిషాల్లో 15 వేల డౌన్‌లోడ్స్

గూగుల్ నిషేధం విధించినప్పటికీ పూనమ్ యాప్ ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. యాప్ విడుదలైన 15 నిమిషాల్లోనే దాదాపు 15 వేల మంది డౌన్‌లోడ్ చేసుకొన్నారు. అంతమంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంపై పూనమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

త్వరలోనే పరిష్కారం

త్వరలోనే పరిష్కారం

గూగుల్ నిషేధం ఓ కొలిక్కి వచ్చే వరకు నా యాప్‌ను నా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలరు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని పూనమ్ అభిమానులను కోరింది. బాలీవుడ్ హీరో గోవింద నటించిన ఆ గయా హీరో అనే చిత్రంలో పూనమ్ చివరిసారిగా కనిపించింది.

బట్టలు విప్పుతా..

బట్టలు విప్పుతా..

పూనమ్ పాండే వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఎప్పడూ ముందుంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అశ్లీల వీడియోలను పెట్టడంలో ఈ సెక్స్‌బాంబ్ ఉత్సాహం చూపిస్తుంటుంది. 2011లో టీం ఇండియా కప్పు గెలిస్తే నగ్నంగా మారుతానని వ్యాఖ్యలు చేసి మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

English summary
Actress Poonam Pandey says her newly launched app, which she promised would have 'bold' content, has been banned by Google. "I don't know why. I see many adult magazines on Play Store and App Store. It's interesting that on one hand Google Play Store is suspending the app and on the other some fans are 'complaining' that I am not even nude in the photos," Poonam said. She unveiled the app on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu