Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నరేష్ కుమారుడు నవీన్ ‘ఊరంతా అనుకుంటున్నారు’
నవీన్ విజయ్‌కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ హీరో హీరోయిన్లుగా బాలాజి సానల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్.రెడ్డి, ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న సినిమాకు ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నవీన విజయ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల చేతుల మీదుగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ... టైటిల్ బావుంటే సగం సినిమా సక్సెస్ అయినట్టే. అందులోనూ ఈ సినిమాకు ఊరంతా అనుకుంటున్నారు అనే నేటివ్ టైటిల్ దొరికింది. నరేష్ కథ విని బావుందని చెప్పాడంటే సినిమాలో విషయం ఉన్నట్టే. నవీన్‌కి ఈ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి అని అన్నారు.
నరేష్ మాట్లాడుతూ... నందిని నర్సింగ్ హోమ్‌తో నవీన్ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మంచి నటుడిగా స్టాండ్ అవ్వాలనేది అడతడి తాపత్రయం. ఈ కథ మాకు బాగా నచ్చింది. మంచి ఎంటర్టైనర్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. గ్రామీణనేపథ్యంలో అందంగా సాగే సినిమా ఇది. క్యూట్ విలేజ్ బోయ్‌గా నవీన్ మెప్పిస్తాడని నిర్మాతలు తెలిపారు.
జయసుధ, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర, అశోక్ కుమార్, ప్రభావతి, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబి, గౌతమ్‌రాజు, అప్పాజి, క్రాంతి కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్, పాటలు: వనమాలి, పెద్దాడమూర్తి, శ్రీహరి మంగళంపల్లి, కెమెరా: జి.ఎల్.ఎన్.బాబు, ఎడిటింగ్: మధు, నృత్యాలు: భాను, కథ: శ్రీమంగళం, రమ్య, ఆర్ట్: కృష్ణమాయ, నిర్మాణ సహకారం: యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్.రెడ్డి, ఎ.పద్మనాభరెడ్డి, రచన, దర్శకత్వం: బాలాజి సానల.