జూన్ 13 నుండి రామానాయుడు స్టుడియోలో ఎన్టీఆర్ పక్కా మాస్ 'ఊసరవెల్లి'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఊసరవెల్లి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మద్యనే రామోజీ ఫిలింసిటీ లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ జూన్ 13 నుండి నానక్ రామ్ గూడా రామానాయుడు స్టుడియోలో జరగనుందని సమాచారం. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ చాలా ప్రొఫిషనల్ హీరోగా నటించాడని అదే కోవలో మాస్ ఇరగదీసాడని సమాచారం.
ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తో ఈ చిత్రం 60 శాతం పూర్తయిందని తెలుస్తుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సురేందర్ రెడ్డి జూ ఎన్టీఆర్ ను ఒక కొత్త పాత్ర లో ప్రదర్శించ బోతున్నాడని తెలుస్తుంది.
jr ntr tamanna oosaravelli surender reddy bvsn prasad జూ ఎన్టీఆర్ తమన్నా ఊసరవెల్లి సురేందర్ రెడ్డి బివియస్ఎన్ ప్రసాద్


Click it and Unblock the Notifications