ఊసరవెల్లి బెనిఫిట్ షో టిక్కెట్ రూ. 2వేలు

By Bojja Kumar

శక్తి లాంటి భారీ ప్లాపు తర్వాత భారీ అంచనాలతో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సక్సెస్ కావడం, కిక్ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు సుంరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, ట్రైలర్స్ లో జూనియర్ సరికొత్త గెటప్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సినిమా విడుదల ముందు వేసే బెనిఫిట్ షో(ప్రీమియర్ షో)కు భారీ ఏర్పాట్లు చేయడమే కాదు టిక్కెట్ రేటు కూడా భారీగా నిర్ణయించారు.

ఈ షోకు ఒక్కో టిక్కెట్ ధర రూ. 2వేలు. కళ్లు పైర్లు కమ్మేలా ధర ఉన్నా....ఈ షో ద్వారా వచ్చే డబ్బులు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారట. అలా అని అందరికీ ఈ టిక్కెట్లు దొరకవు, ప్రముఖులు, అభిమానులకు మాత్రమే పరిమితం. ఐడియా బాగానే ఉందని అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ....విడుదలకు ముందే సినిమా చూద్దామని ఆశ పడ్డ వీరాభిమానుల రూ. 2 వేలు పెట్టేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా పతాకంపై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా రిలీజవుతోందీ సినిమా. అక్టోబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్‌.ఆర్‌. డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X