సాటిలేని ‘దూకుడు’కు ధీటుగా ‘ఊసరవెల్లి’ ఆల్‌ టైమ్ రికార్డ్...!

By Sindhu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై 'కిక్" సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బి బాపినీడు సమర్పణలో 'ఛత్రపతి" ప్రసాద్ నిర్మించిన 'ఊసరవెల్లి విజయదశమికి కానుకగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది.ఎన్టీఆర్ హీరోయిజం, డాన్సులు, పంచ్‌ డైలాగులు..హాస్యం, ఉద్వేగం, సెంటిమెంట్‌, రిచ్‌నెస్‌ జనాల్ని విశేషంగా అలరిస్తున్నాయి. తమన్నా నటన అద్భుతంగా ఉందని ప్రశంసలొస్తు న్నాయి.

'ఊసరవెల్లి" హిట్ చేసి ప్రేక్షకులు విజయదశమికి నాకు మంచి కిక్‌ నిచ్చారు. నా జీవితంలో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 'ఊసరవెల్లి ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని ఊహించలేదు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ కు, అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కు నా కృతజ్ఞతలు" అన్నారు సురేందర్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఊసరవెల్లి" ఎన్టీఆర్ కథానాయకుడు. తమన్నా నాయిక. ఈ చిత్రం విజయదశమి కానుకగా విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ' దసరా సందర్భంగా విడుదలైన 'ఊసరవెల్లి" చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అన్నారు. కె అచ్చిడ్డి మాట్లాడుతూ 'ఆర్ఆర్ మూవీమేకర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1800 ధియేటర్లలో విడుదల చేశాం. పంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డుస్థాయి కలెక్షన్స్ సాధిస్తూ ఆల్‌టైమ్ రికార్డ్‌ని సాధించింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 75 లక్షల 95 వేలు గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తుండటం ఆనందంగా వుంది" అన్నారు.

ఒక్క తొలిరోజే 15కోట్ల 75లక్షల గ్రాస్‌ వసూలు చేసి 'ఊసరవెల్లి" సరికొత్త రికార్డ్‌ సృష్టించిందని పంపిణీదారుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి తెలిపారు. రాయలసీమలో 2కోట్ల 92లక్షలు, నైజామ్‌లో 3కోట్ల 73లక్షలు, నెల్లూరులో 49లక్షలు, గుంటూరులో కోటి 43లక్షలు, కృష్ణలో 75లక్షలు, విశాఖలో 66లక్షలు, తూ.గో జిల్లాలో 71లక్షలు, ప.గో జిల్లాలో 63లక్షలు, అమెరికాలో కోటి 98లక్షలు, ఇతరచోట్ల (ఒరిస్సా, చెన్నై, మహారాష్ట్ర, ఉత్తరభారతం)..కోటి 30లక్షల వసూళ్లు సాధించిందని వివరాలు వెల్లడించారు.కాగా ఎన్టీఆర్ కూడా ఈ ఓపెనింగ్స్ పట్ల హ్యాపీ గా వున్నట్టు సమాచారం .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X