ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఊసరివిల్లి చిత్రం దసరాకు విడుదల అవుతుందని మొదట ప్లాన్ చేసారు.కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ బట్టి చూస్తే అది డిసెంబర్ కి విడుదల అయ్యే వాతావరణం కనపడుతోంది.ఇక బోయపాటి శ్రీను తో చేస్తున్న చురకత్తి చిత్రం వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు.దసరాకు వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ఇది చేదు వార్తే.ఇక క్యారెక్టర్ కాంప్లికేటెడ్ గా ఉండటంతో ఎక్కువ రోజులు కేటాయించి మరీ హిట్ కొట్టాలని ఎన్టీఆర్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.పండుగకు విడుదల కాకపోయినా ఫర్వాలేదు కానీ సినిమా సూపర్ హిట్ కాకపోతే సూప్ లో పడతానని ఆయన భావిస్తున్నారు.అందుకోసం బోయపాటి సినిమాను ప్రక్కన పెట్టి మరీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఊసరివిల్లి చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











