‘ఊసరవెల్లి’కి అదిరిపోయే ఫిల్మింనగర్ టాక్...!
జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రం దసరా నాడు రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ కాఫీ కూడా రెడీ అయిపోవడంతో ఇక విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేలిపోయింది. దూకుడు చిత్రం సూపర్ హిట్ అవడంతో, ఈ చిత్రంతో ఎన్టీఆర్ కూడా ఓ పెద్ద హిట్ కొట్టి పరిశ్రమకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడని అంచనాలున్నాయి.
కాగా 'స్టార్ పొటన్షియల్", 'పబ్లిసిటీ, 'ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది", 'టిక్కెట్ రేట్లు", "పబ్లిక్ హలీడేస్", “ఒక్కసారి చూడవచ్చు అనే మొదటిరోజు టాక్" అనే దానిపై ఆ సినిమా ఓపినింగ్స్ ఆధారపడి వుంటాయి. అన్నీ కలిసొచ్చి 80 సవంత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దూకుడు బెస్ట్ ఓపినింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
'ఒక్కసారి చూడవచ్చు అనే మొదటిరోజు టాక్" సంపాదిస్తే బెస్ట్ ఓపినింగ్స్‌కు కావలసిన మిగతా క్వాలిటీస్ అన్నీ యంగ్ ఎన్టీఆర్ కు వున్నాయి కాబట్టి 'ఊసరవెల్లి" సినిమాతో దూకుడు రికార్డ్స్ అవుట్ అనే టాక్ వినిపిస్తుంది. సురేందరరెడ్డి 'కిక్" లాంటి స్క్రీన్‌ప్లే మరియు క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్ మళ్ళీ రిపీట్ చేయగల్గితే, రికార్డ్స్ బ్రద్దలు కొట్టడం యంగ్ ఎన్టీఆర్‌కు కొత్త కాదని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











