‘ఊసరవెల్లి’ లాంటి సినిమా ఒక్కటి ఉంటే చాలు: తమన్నా

By Sindhu

'హ్యాపీడేస్" చిత్రం సాధించిన విజయంతో క్రేజీతారగా ఎదిగిన తమన్నా ఇప్పుడు టాలీవుడ్‌ లోని అగ్రహీరోయిన్లలో ఒకరిగా భాసిల్లుతున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్ సరసన 'రచ్చ" చిత్రంతో పాటు ప్రభాస్‌ కు జోడిగా 'రెబల్", రామ్‌ తో 'ఎందుకంటే ప్రేమంట" చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌ లో మరిన్ని క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. ఇదలా వుంచితే ఈ మధ్య తమన్నాను ఎవరు కదిలించిన 'ఊసరవెల్లి" తను పోషించిన నిహారిక పాత్ర గురించే చెప్పుకొస్తుందట.

అంతేకాదు కథలో కీలకంగా వున్న ఆ పాత్రను పోషించడం తనకెంతో ఆనందంగా వుందని చెబుతున్న ఈ బ్యూటీ ఈ విషయమై స్పందిస్తూ ' గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న నిహారిక లాంటి పాత్రలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. నా పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కోమా నుంచి బయటికొచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాల్లో నా నటన గురించి అందరి మాట్లాడుకుంటుంటే సంతోషంగా వుంది. ఎన్ని చిత్రాలు చేసినా కెరీర్ ముగింపులో చెప్పుకోవటానికి కొన్ని చిత్రాలే వుంటాయి. అందులో ఒకటిగా 'ఊసరవెల్లి తప్పకుండా వుంటుంది" అని తెలిపారు తమన్నా.

ఇలా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా ఇటీవల ఓ సందర్భంలో గ్లామర్ గా నటించడంపై తన లిమిట్స్ గురించి మాట్లాడుతూ 'సినిమాకి గ్లామర్ చాలా ముఖ్యం. ఎబ్బెట్టుగా లేనంతవరకూ గ్లామర్ గా నటించడంలో తప్పులేదు. కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్ ఏ డ్రెస్స్ ఇచ్చి వేసుకోమంటే అది వేసుకుంటాము. కానీ లిమిట్ దాటి మరి ఎక్స్ పోజింగ్ డ్రెస్స్ ఇస్తే మాత్రం..దానికి బదులు వేరే డ్రేస్స్ వేసుకుంటే బెటర్ అని చెబుతుంటాను. అయినా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారమే నేను డ్రెస్సులు వేసుకుంటున్నానని అంటున్నది మిల్కీ బ్యూటీ తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X