హద్దులు దాటిన ‘ఊసరవెల్లి'కి బంపర్ బిజినెస్...!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఊసరవెల్లి మంచి అంచనాలతో వస్తోంది. ఈ చిత్రం లో జూ ఎన్టీఆర్ సరసన అందాల ముద్దుగుమ్మ తమన్నా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రోపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఊసరవెల్లి ఆడియోను సెప్టెంబర్ 12న జరగాల్సి ఉండగా, అది కాస్తా సెప్టెంబర్ 15కి వాయిదా పడింది. తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్ 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియోను ఘనంగా జరపడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పసందైన బాణీలు అందించారు. దాంతో ఈ సినిమా ఆడియో రైట్స్ రూ.45 లక్షలు పలికింది. ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదల కానుంది. విజయదశమి కానుకగా ఊసరవెల్లి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అయితే విడుదలకు ముందే ఈ చిత్రం మంచి వ్యాపారాన్ని జరుపుకుంటోంది. కర్ణాటక ప్రదర్శన హక్కులను దాదాపు 2 .75 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో నేటి యువతరం తెలుగు హీరోలకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యం గా తెలుగు వారు ఎక్కువగా ఉండే బళ్ళారి లో తెలుగు చిత్రాలు బాగా ఆడుతాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రం ఆర్ఆర్ మూవీ మేకర్స్ ద్వారా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, రెహమాన్, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తదితరులు ఇతర తారాగణం.


Click it and Unblock the Notifications











