ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' పాటల ట్రాకులు ఇవే
ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతో ఆత్రం గా ఎదురుచూస్తున్న ఊసరవెల్లి చిత్రం ఆడియో ఈ రోజు(గురువారం)సాయంత్రం శిల్ప కళా వేదిక లో ఘనం గా జరగనుంది. ఊసరవెల్లి పాటలు ఈ క్రమం లో ఉండబోతున్నాయి
1.బ్రతకాలి
2. ఎలంగో ఎలంగో
3. నేనంటే నాకు
4.ఊసరవెల్లి
5. భంగర ఆంధ్ర
6. నిహారిక
7. శ్రీ ఆంజనేయం
8. లవ్ అంటే కేరింగ్
పరిస్థితులకి తగ్గట్లు రంగులు మార్చుకుంటూ తన లక్ష్యాన్ని సక్రమ మార్గంలో హీరో ఎలా చేరుకున్నాడనేది 'ఊసరవెల్లి' లోని ప్రధానాంశం. ఎవరూ ఊహించని మలుపులతో నడిచే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్‌ప్లే ప్రధానాకర్షణ . 'కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











