బాలకృష్ణ, ఎన్టీఆర్ లలో ఎవరోఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే
దసరా సీజన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య శ్రీరామ రాజ్యం. జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" చిత్రాలతో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ పోటీ పడనున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలో విడుదలవడం మంచిది కాదనే నమ్మకం ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఈ రెండు చిత్రాలు అదే సమయానికి విడుదలకి సమయాత్తమవుతున్నాయి.
ముందుగా ప్లాన్ చేసుకొని షెడ్యూల్స్ కావడంతో ఈసారి పోటీ అనివార్యమవుతోంది. గతసంవత్సరంలో దసరాకి విడుదలైన బృందావనం సెలవుల వల్ల బాగా లాభపడడంతో జూ ఎన్టీఆర్ తన ఊసరవెల్లి చిత్రాన్ని కూడా అదే సీజన్ లో విడుదల చేసుకోవడానికి ముందు నుంచీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే విధంగా బాలకృష్ణ నటించిన భక్తిరస చిత్రం 'శ్రీరామ రాజ్యం" కి కూడా అదే తగిన సమయమని నిర్మాత నమ్ముతూ ఉండడంతో దసరా సీజన్ లోనే ఇది కూడా విడుదల కానుంది. ఒకవేళ బాబాయ్, అబ్బాయ్ లలో ఎవరూ కాంప్రమైజ్ కాకపోతే నందమూరి అభిమానులకి దసరా సీజన్ లో ఎటువైపు మొగ్గాలనే విషయంలో సందిగ్దం తప్పదనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











