twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడుకు ఊసరవెల్లి సెగలు

    By Bojja Kumar
    |

    జూ.ఎన్టీఆర్ ఊసరవెల్లి విడుదలకు ముందే హీట్ పుట్టిస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఊసరవెల్లి ఫస్ట్ కాపీ శనివారం సెన్సార్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కిక్ లాంటి సూపర్ హిట్ భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తుండటం, ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్స్‌లోనే రసూల్ సినిమాటో గ్రఫీ పనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటం, ఎన్టీఆర్ గతంలో కంటే సరికొత్త స్టయిల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోతోంది.

    తమన్నా హాట్ అందాలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇక పోతే...తాజాగా టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకెలుతున్న మహేష్ 'దూకుడు"కు ఊసరవెల్లి రాకతో జోరు తగ్గుతుందని, ఈ సినిమా దూకుడును బీట్ చేయడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.

    భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా పతాకంపై ఛత్రపతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా ఊసరవెల్లి విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్‌.ఆర్‌. డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది.

    English summary
    Oosaravelli is looking like a complete package which can outperform shallow Dookudu. It is just running because of Mahesh's star power and will eventually lose the heat if a tough competitor comes into the field.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X