»   »  క్రేజ్ తోనే కొడతాడు: ప్రభాస్‌ భారీ స్కెచ్

క్రేజ్ తోనే కొడతాడు: ప్రభాస్‌ భారీ స్కెచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాహుబలి తర్వాత తన కెరీర్ పూర్తి స్దాయిలో మారిపోతుందని ప్రభాస్ భావిస్తున్నాడు. ఆ నేపధ్యంలో కొత్త స్టాటజీలతో ముందుకు వెళ్లాలని ప్లాన్స్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా...బాలీవుడ్ లో ఓ చిత్రం చేయాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ భాషలు కలిసి వచ్చేలా హిందీ దర్శకుడుతో తన సొంత బ్యానర్ పై బాలీవుడ్ చిత్రం చేయాలని ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాహుబలి చిత్రంతో బాలీవుడ్ కు భారిగా వెళ్తున్నాం. ఆ క్రేజ్ ని కంటిన్యూ అయ్యేలా...ప్లాన్స్ ఉండాలని రాజమౌళి సైతం సూచించినట్లు సమాచారం. దానికి తోడు ప్రభాస్‌ హిందీ సినిమాలకు ఇప్పటికే సిద్ధమే అంటున్నారు. ఇటీవల వచ్చిన అజయ్‌ దేవ్‌గణ్‌ బాలీవుడ్‌ చిత్రం 'యాక్షన్‌ జాక్సన్‌'లో ఓ అతిథి పాత్రలో కనిపించి బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు ప్రభాస్‌.

మున్ముందు బాలీవుడ్‌లో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో అతి పెద్దదైన బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో పనిచేయడానికి ఎవరికైనా ఆసక్తేనని, తానూ అందుకు మినహాయింపు కాదని ప్రభాస్‌ పేర్కొన్నారు.

Open to do Bollywood films: Prabhas

ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ రాజమౌళి కలల వెంచర్ ‘బాహుబలి' పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సౌండ్ ఇంజనీరింగ్ లో జాతీయ అవార్డు గ్రహిత పి.ఏం సతీష్ సారధ్యంలో డాల్బీ అట్మాస్ సౌండ్ పరిజ్ఞానంలో విడుదలకానుంది.

ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం

‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

English summary
Prabhas says he would love to act in a Bollywood movie in the future. The 35-year-old actor, who will be seen in SS Rajamouli's upcoming multi-lingual two-part epic drama "Baahubali", had earlier made a friendly appearance in Ajay Devgn starrer "Action Jackson". "Who wouldn't do a Bollywood film. It is India's biggest film industry. If I get a good offer, I will definitely do it," Prabhas told PTI.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu