Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మా! ఇదెక్కడి ఖర్మ!
దీనిపై ఎవరైనా తమ నిరసనలను [email protected] లో పోస్ట్ చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ సినిమాలను తాము ఇష్టపడతామని కానీ ఇలా జనగణమన గీతాన్ని అపవిత్రం చేయడం తగదని వారు అంటున్నారు. వర్మ అటువంటి సన్నివేశాలను తొలగించి, జాతీయ గీతంపై తన గౌరవాన్ని చాటుకోవాలని వారు కోరారు. దీనిపై భారత రాష్ట్రపతికి, ప్రధానికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతి పత్రాలను పంపుతున్నమని వారు తెలిపారు.
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా హెడ్ లైన్స్ కెక్కే వర్మ ఇప్పుడు దానిపైనే యుద్దం ప్రకటించనున్నాడు. ఇదే విషయాన్ని వర్మ తన బ్లాగ్ లో ప్రస్తావిస్తూ...తను తర్వాత తీస్తున్న చిత్రం పేరు రణ్ అనీ ప్రకటించాడు. రణ్ అర్దాన్ని కొన్ని భారీ స్దాయిలో ఆర్గనైజ్ చేయబడుతున్న కొన్ని గ్రూపుల మధ్య యుధ్థం గా వర్ణించాడు. ఇక ఈ చిత్రంలో న్యూస్ ఛానెల్స్, పేపర్లు కలసి బ్రేకింగ్ న్యూస్ కోసం వారిలో వారు చేసే పోరాటాల్ని,చీప్ జిమ్మిక్స్ ని బయిటపెడతానంటున్నాడు. మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అంటారని,అదే పిల్లి కుక్కను కరిస్తే బ్రేకింగ్ న్యూస్ అంటారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ న్యూస్ ఛానెల్స్ టీవీ సీరియల్స్,థ్రిల్లర్స్ కన్నా మంచి ఎంటర్ టైన్ మెంట్ ని ఇస్తాయంటూ విమర్శించాడు. తమ సర్కులేషన్,టీరీపీ రేటింగ్స్ పెంచుకునేందుకు అవి ఎంతకైనా దిగజారుతున్నాయని అదే సబ్జెక్టు అనీ చెప్పుకొచ్చాడు.