‘ఆపరేషన్ 2019’ ట్రైలర్: ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు!

By Bojja Kumar

Recommended Video

OPERATION 2019 Official Theatrical Trailer Released

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రం అప్పట్లో మంచి విజయం అందుకుంది. దానికి సీక్వెల్ అని చెప్పలేం కానీ అలాంటి ట్రీట్మెంటుతోనే మరో పొలిటికల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఆపరేషన్ 2019' పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రంలో మరోసారి శ్రీకాంత్ తన నట విశ్వరూపం చూపించబోతున్నారు. 'బివేర్ ఆఫ్ పబ్లిక్' అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2019 ఎన్నికలను టార్గెట్ చేస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ముఖ్యంగా అతడు చెప్పిన డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

‘బివేర్ ఆఫ్ పబ్లిక్’

‘బివేర్ ఆఫ్ పబ్లిక్’

‘బివేర్ ఆఫ్ పబ్లిక్' ... అంటే ప్రజలున్నారు జాగ్రత్త అని అర్థం. మన పొలికల్ సిస్టంలోని లోపాలు, అవినీతి రాజకీయ నాయకులు, డబ్బుకు అమ్ముడు పోయే ప్రజలు లాంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ నటవిశ్వరూపం

శ్రీకాంత్ నటవిశ్వరూపం

2007లో వచ్చిన ‘ఆపరేషన్ ధుర్యోదన'లో శ్రీకాంత్ నగ్నంగా నటించి తన నట విశ్వరూపం చూపించాడు. అదే తరహాలో శ్రీకాంత్ మరోసారి తనదైన పెర్పార్మెన్స్ తో అదరగొట్టబోతున్నాడని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు

ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు

గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ తరుపున మెగాస్టార్ పుట్టడు... ఎవరైనా ప్రజల్లో నుండి పుట్టుకురావాల్సిందే. వివిధ రూపాల్లో వివిధ పేర్లతో సమ్ ఆర్ కమింగ్ సమ్ ఆర్ గోయింగ్ అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ట్రైలర్

ఈ చిత్రానికి కరణం బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ సమర్పణలో అలివేలమ్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై అలివేలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ ముకళి, నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X