'ఆపరేషన్‌ దుర్యోధన 2' స్టోరీ లైన్ ఏమిటంటే..

By Srikanya

హైదరాబాద్: అప్పట్లో శ్రీకాంత్, పోసాని కృష్ణ మురళి కాంబినేషన్ లో 'ఆపరేషన్‌ దుర్యోధన' చిత్రం వచ్చి విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తరహాలో 'ఆపరేషన్‌ దుర్యోధన 2' టైటిల్ పెట్టి మరో చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సారి శ్రీకాంత్ హీరోగా చేయటం లేదు. జగపతి బాబుకీ రోలు చేస్తున్నారు. నందం హరిశ్చంద్రరావు దర్శకుడు. ఇందులో రాష్ట్ర న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.

ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే...ముఖ్యమంత్రి పీఠమ్మీద కన్నేసిన కొందరు నాయకులు పన్నిన కుట్రను సీబీఐ అధికారి అశోక్‌ ఎలా భగ్నం చేశాడే పాయింట్ తో కథ జరుగుతుంది. కథనం,డైలాగులు ప్రధానాంశాలుగా ఈ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సీబీఐ అధికారి అశోక్ గా జగపతి బాబు కనిపిస్తారు.అధికారం కోసం సాగించే ఎత్తుకుపైయెత్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఈ చిత్రంలో చూపిస్తున్నామని చెప్తున్నారు.

'ఆపరేషన్‌ దుర్యోధన 2' హైదరాబాద్‌లో షూటింగ్ సాగుతోంది. నిర్మాతలు జిట్టా సురేందర్‌రెడ్డి, ఎ.బి.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ''రాజకీయపరమైన అంశాలను స్పృశిస్తూ సాగుతుందీ కథ. అధికారం కోసం సాగించే ఎత్తుకుపైయెత్తులు ఏ స్థాయిలో ఉంటాయో చూపిస్తున్నాం. జగపతిబాబు, కోట, పోసానిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి''అన్నారు.

ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ -''నీతి, నిజాయతీకి కట్టుబడి పనిచేసే ఓ ముఖ్యమంత్రి పాత్ర చుట్టూ సాగే కథ ఇది. అధికారం చేజిక్కించుకొనేందుకు కొద్దిమంది నాయకులు ఎలాంటి సమస్యల్ని సృష్టించారనే విషయం ఆసక్తికరం. రాజకీయ విలువల్ని ప్రతిబింబించే చిత్రమిది. నాకిది నాలుగో చిత్రం. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది'''అన్నారు.

''సమాజంలోని చెడును ఎత్తిచూపే చిత్రమిది''అన్నారు కోట శ్రీనివాసరావు. వచ్చే నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోసాని కృష్ణమురళి, సాయాజీషిండే, రావు రమేష్‌, ఆర్‌.కె., సోనియా, కత్తి కార్తీక ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ. సమర్పణ: ఏరాసు ప్రతాప రెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X