కాశ్మీర్, ఉగ్రవాదంపై ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. టీజర్ లాంచ్ చేసిన మహేష్ బాబు
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం, కాశ్మీరీ పండిట్ల ఊచకోత అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ రూపొందుతున్న చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. సాయికిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ ఎన్ఎస్‌జి కమాండోగా నటిస్తున్నాడు. ఎయిటెల్ మోడల్ శషా చెత్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత అబ్బూరి రవి.. ఘాజీ బాబా అనే ఉగ్రవాది పాత్రలో నటుడిగా పరిచయం కాబోతున్నాడు.
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా లాంచ్ అయింది. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. దర్శకుడు ఊచకోతకు గురైన పలువురు కాశ్మీరీ పండిట్ కుటుంబాలను కలిసి వివరాలు సేకరించి ఈ కథ తయారు చేశారట దర్శకుడు సాయి కిరణ్.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఇంకా కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రామజోగయ్యశాస్త్రి , రావు రమేశ్ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.
వినాయకుడు టాకీస్ బేనర్లో రూపొందుతున్న ఈచిత్ర నిర్మాణంలో ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గ్యారీ బి.హెచ్.జి, సతీష్ డేగలతో పాటు సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు భాగం అయ్యారు.


Click it and Unblock the Notifications











