అమీర్ ఖాన్ 'ఆపరేషన్ స్పైడర్‌మేన్' ఎందుకంటే..
అమీర్ ఖాన్ గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న 'ఆపరేషన్ స్పైడర్‌మేన్' పోగ్రాం ఎందుకు రూపొందించాల్సి వచ్చిందో లేటస్ట్ గా బాలీవుడ్ మీడియాకి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..నా తాజా చిత్రం 'త్రీ ఇడియట్స్'లో నేను పోషించిన రాంచో పాత్ర ఎవరికీ కనిపించకుండా మాయమైపోతుంది. స్నేహితులంతా నా కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.ఈ పాయింట్ ఆధారంగానే నేను తప్పిపోయి దేశమంతా తిరుగుతుంటే నా అభిమానులు నన్ను వెతకడం అనే అంశం చుట్టూ ఈ యాత్ర తయారు చేశాం. ఈ యాత్రలో నాకు 'ఫాంటమ్' అనే కోడ్ పేరు పెట్టారు. రిలీజుకు నాలుగు నెలల ముందే నేనే ఈ ప్రణాళిక రచించాను. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా మంది సాయపడ్డారు.ఈ మొత్తం ఆపరేషన్‌కి 'ఆపరేషన్ స్పైడర్‌మేన్' అని పేరు పెట్టాం. మొత్తానికి ఇది నాకు సరదాగా అనిపించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు..వంటి రాష్ట్రాల్లో తిరిగాను. వెళ్లిన ప్రతిచోటా చాలా మంది స్నేహితులు అయ్యారు. వారికి బంగారు ఉంగరాలు బహూకరించి 'త్రీ ఇడియట్స్' ప్రత్యేక ప్రదర్శనకి ఆహ్వానించాను అని ఆ పర్యటన సూపర్ హిట్టై సినిమా విపరీతమైన కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న ఆనందంలో చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











