ఆపరేషన్ వాలెంటైన్ సెన్సార్ రివ్యూ: వరుణ్ తేజ్ మూవీ ఎలా ఉంది? ఎంత సేపు ఉంటుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే తమదైన విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పద్దతిగా విభిన్నమైన చిత్రాలు చేస్తోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుణ్ 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాను చేశాడు. శుక్రవారమే విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

ఆపరేషన్ వాలెంటైన్‌తో:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఎయిర్‌ఫోర్స్ బ్యాగ్‌డ్రాప్ మూవీనే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలను చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు.

Operation Valentine Movie Censor Certificate and Run Time Details

ప్రమోషన్స్‌ జెట్ స్పీడ్:వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో మార్చి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ పూర్తి చేసింది.

ఆ సర్టిఫికెట్ ఇచ్చారు:అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

Operation Valentine Movie Censor Certificate and Run Time Details

రన్ టైం ఎంత అంటే:వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ఈ సమాచారం ప్రకారం.. ఈ మూవీ 2 గంటల 4 నిమిషాల (124 నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలిసింది. అంటే సాధారణంగా వచ్చే సినిమాల కంటే చాలా తక్కువ రన్ టైంతోనే వరుణ్ తేజ్ చిత్రం వస్తుందని చెప్పాలి.

సెన్సార్ రివ్యూ ఇలా:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో ఎయిర్‌ స్ట్రయిక్ సన్నివేశాలు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంటాయట. అలాగే క్లైమాక్స్‌ అదిరిపోయేలా ఉందని చెప్పారని టాక్. మొత్తంగా ఈ చిత్రం దేశ భక్తిని రగిల్చేలా ఉంటుందట.

Operation Valentine Movie Censor Certificate and Run Time Details

టాక్ వస్తే మూవీ హిట్టే:ఆ మధ్య వరుస హిట్లతో సత్తా చాటిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గత చిత్రాల ఫలితాలతో డీలా పడిపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ చేశాడు. ఎయిర్ స్ట్రయిక్ నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వస్తే హిట్ అవడం ఖాయం అని చెప్పొచ్చు. దీనికి కారణం ఇది దేశ భక్తి మూవీ కావడమే అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X