రామ్ చరణ్ 'ఆరెంజ్' ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్...
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆరెంజ్ చిత్రం అక్టోబర్ 14న ఆడియో రిలీజ్,నవంబర్ 5న చిత్రం రిలీజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజిల్లో ఉంది. నిర్మాత నాగబాబు..ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మలేషియా, ఆస్ట్రేలియా, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఇప్పటికే షూటింగ్ జరిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైంది. శబ్దాలయా స్టూడియోస్ లో కొద్ది రోజుల నుంచి ఈ చిత్రానికి సంభందించి డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి హేరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో షాజన్ పదమ్ సీ సెకెండ్ హీరోయిన్ గా చేస్తోంది. టీనేజ్ అమ్మాయిగా, ఫ్రెష్‌గా ఆమె ఈ చిత్రంలో కనిపిస్తానని చెప్తోంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది.
ఆరెంజ్ జెనీలియా రామ్ చరణ్ తేజ్ నాగబాబు షాజన్ పదమ్ సీ orange genelia ram charan teja nagababu shazahn padamsee


Click it and Unblock the Notifications