శిల్సకళా వేదికలో మొదలైన రామ్ చరణ్ ‘ఆరంజ్’ పాటల సందడి...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరంజ్" బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని పెద్ద మొత్తానికి సోని మ్యూజిక్ వారితో పోటీపడి ఆదిత్య మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైటెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి పెట్టిన ఓ రేంజ్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ప్రతి విషయంలోనూ (హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, స్టైలింగ్) రామ్ చరణ్ కొత్తగా న్యూ స్టైల్ లో కనపడేలా జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు తాను నటించిన రెండు చిత్రాల్లో నూ ఒకే కథానాయికతో నటించిన రామ్ చరణ్ మొదటి సారిగా జెనీలియా, షాజహాన్ పదమ్సీ, సంచిత శెట్టి వంటి పలువురు హీరోయిన్ లతో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఆడియో ఈ రోజు(25.10.10) సాయంత్రం శిల్స కళా వేదికలో రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే వివిద ప్రాంతాల నుండి వచ్చిన మెగా అభిమానులతో శిల్స కళావేదిక కళకళలాడుతోంది.


Click it and Unblock the Notifications











