కెనడాలో ఆరంజ్ హాక్కులను సోంతం చేసుకున్న టివిసి మూవీస్ ..!
రామ్ చరణ్ తేజ్, జెనీలియా జంటగా నటించిన చిత్రం ఆరంజ్ హాక్కులను కెనడాలో టివిసి మూవీస్ వారు సోంతం చేసుకున్నారు. కెనడా లోఆరంజ్ చిత్రాన్ని మొదట మూడు ప్రింట్లతో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు టివిసి మూవీస్ సంస్ద వారు వెల్లడించారు. విసి మూవీస్ సంస్ద గతంలో కెనడాలో ఖలేజా మరియు బృందావనం సినిమాలను విడుదల చేయడం జరిగిందని టివిసి మూవీస్ ప్రతినిధి వరుణ్ చక్రవర్తి తెలిపారు.
ఇక ఆరంజ్ చిత్రం విషయానికి వస్తే తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాసినటువంటి మగధీర చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నటువంటి మూడవ సినిమా. ఈసినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గాజెనీలియా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈసినిమాకి సంబంధించి ఎక్కువభాగం షూటింగ్ ఆస్ట్రేలియా మరియు మలేషియా తీయడం జరిగింది. గతంలో బోమ్మరిల్లు మరియు పరుగు లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించినటువంటి బోమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈసినిమాలో రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారిగా లవర్ బాయ్ గాకనిపించనున్నారు. ఈసినిమాలో జెనిలియా తోపాటు షాజన్ పదాంసి మరోకధానాయకగా కనిపించనున్నారు.
చివరగా ఈచిత్రం కెనడా హాక్కులను సోంతం చేసుకున్నటువంటి టివిసి మూవీస్ ప్రతినిధి వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మాకు ఈచిత్రం హాక్కులను ఇచ్చినటువంటి నిర్మాత నాగబాబు గారికి, అల్లుఅరవింద్ గారికి, ఠాగూర్ మధుగారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. కెనడాలో ఎవరైన ఈచిత్రం ప్రదర్శించాలనుకునేవారు ఈక్రింది పోన్ నెంబర్లుకు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా కోరారు.
SS - 6472482402, T.Varun Chakravarthi - 6477708171,4163008171


Click it and Unblock the Notifications











