రామ్ చరణ్ "ఆరెంజ్" చిత్రం డిసాస్టర్ అని తేల్చేసిన 'సాక్షి' ఛానెల్
రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" ని డిజాస్టర్ అని సాక్షి ఛానెల్ వారు తేల్చేసారు. అంతేగాక ఈ చిత్రం కొని నష్టపోయిన వారందరికీ చరణ్ తండ్రి పీఆర్పీ పార్టీ అధినేత చిరంజీవి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, నిర్మాతలు మొదట తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల, ఆ తర్వాత కొడుకు రామ్ చరణ్ వల్ల చాలా లాస్ అయ్యారని వారిని ఆదుకొని సామాజిక న్యాయం చేయాలని సూచించారు. అలాగే ఆరెంజ్ చిత్రం రెండో రోజే ధియోటర్స్ ఖాళీ అయ్యాయని, మూడో రోజుకు చాలా చోట్ల తీసివేసారని ఆరోపించారు. దాంతో రామ్ చరణ్ ఇలా స్పందించారు.
అంతేగాక చిరంజీవి గత చిత్రాలు అయిన మృగరాజు, అందరివాడు, జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ వంటివి నిర్మాతలకు చాలా నష్టాలు తెచ్చిపెట్టాయని,వారికీ సామాజిక న్యాయం చేయాల్సిన భాధ్యత ఉందని అంటున్నారు. అక కొమరం పులి, గుడుంబా శంకర్, బాలు,బంగారం, అన్నవరం వంటి చిత్రాలతో పవన్ కూడా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు తెచ్చిపెట్టారని,యువరాజ్యం నేతగా ఆయన కూడా సామాజిక న్యాయం చేయాల్సిన భాధ్యత ఉందని అన్నారు. ఇక తాజా చిత్రం ఆరెంజ్ కి మగధీర రేంజిలో భారీ బడ్జెట్ పెట్టారని ప్రచారం చేసి మోసం చేసారని ఆరోపించారు. రెండో రోజున ఆరెంజ్ ధియోటర్స్ వద్ద జనాలు కరువయ్యారని, మూడో రోజుకే చాలా ధియోటర్స్ లో తీసేసారని, అలాగే మగధీర గొప్పతనం మొత్తం రాజమౌళిదేనని తేల్చారు.
ఆరెంజ్ కొనుక్కున్న చాలా మంది అరవై నుంచి డబ్బై శాతం వరకూ నష్టపోయారని, వారికి రజనీకాంత్ తమిళనాడులో చేసినట్లుగా సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చాలాసార్లు రజనీకాంత్ తనకు ఇన్సిప్రేషన్ అని చెప్పే చిరంజీవి ఎందుకని ఆయన దారిలో ప్రయాణించి తమ మెగా ఫ్యామిలీ సినిమాల వల్ల నష్టపోయిని ఆదుకోరని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











