twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరెంజ్ ప్లాప్ తో క్రేజ్ తగ్గింది.. అందుకే పెళ్ళి రెడీ అవుతోందా..

    By Sindhu
    |

    జెనీలియా లేకపోతే 'బొమ్మరిల్లు" సినిమాయే లేదు అన్నంతగా ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు డైరెక్టర్ భాస్కర్. బొమ్మరిల్లు యూనిట్ తనపై చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదని ఆడియో ఫంక్షన్ లో కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ అలాంటిది మరి. సినీ ప్రముఖులు, ఫిలిం క్రిటిక్స్ కూడా ఆమె అభినయం అద్బుతం అన్నారు. ఈ మద్య రిలీజ్ అయి ప్లాప్ అయిన 'ఆరెంజ్"లో జెనీలియా నటన చూసి నొసలు చిట్లించారు. ఆమె స్క్రిన్ మీద కనిపించినంత సేపూ ఆడియన్స్ ఎలర్జీ వచ్చినవారిలా అయిపోయారు.

    బొమ్మరిల్లు మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశాడు భాస్కర్ అంతే. అప్పటివరకు జెనీలియా అంటే ఆడియన్స్ లో వున్న క్రేజ్ పోయింది. ఇప్పుడు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి నిర్మాతలు భయపడుతున్నారు.ప్రస్తుతం హిందీ, తమిళం, మలయాళంలలో ఒక్కో సినిమా చేస్తోంది. హిందీ తప్ప మిగతా సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాదు. బొమ్మరిల్లు, ఢీ చిత్రాల తర్వాత ఆమె కెరీర్ మంచి ఊపందుకుంది. మధ్యలో ఆరెంజ్ చేయకుండా వుంటే బాగుండేది. ఇప్పుడు తెలుగులో సినిమాలు లేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది జెనీలియా. హాసినిగా అందర్నీ అలరించిన జెనీలియాకు ఇప్పుడు ప్రేక్షకుల, దర్శకనిర్మాతల ఆదరణ కరువైంది.

    అయితే ఇది మెల్లిమెళ్లగా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. ఈ తరుణంలో జెనీలియా త్వరలో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పనుందా? ఇక రియల్ లైఫ్ లో సెటిల్ కానుందా? ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. తన చిరకాల మిత్రుడు, సహ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను త్వరలో జెన్నీ పెళ్లి చేసుకోనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడైన రితేష్ తో జెనీలియా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.

    ఇన్నాళ్లూ తమ సాన్నిహిత్యాన్ని గుంభనంగా ఉంచిన ఈ జంట, ఈ మధ్య తమ బంధాన్ని మెల్లిగా బయటపెడుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల వెడ్డింగ్ ఎనివేర్సరీలో ఈ జంట అందరి ముందూ కలసి మెలసి తిరిగారు. ఇది చూసిన బాలీవుడ్ జనం 'ఇక త్వరలో వీళ్లిద్దరూ మేరేజ్ చేసుకోవచ్చు. అందుకే తమ బంధాన్ని నలుగురి ముందూ ప్రదర్శిస్తున్నారు' అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొన్నాళ్ళాగాల్సిందే!

    English summary
    Indian Actress Genelia D'Souza, better known by her on screen name Genelia, is in a relationship with a bollywood actor if the media reports are to be believed. According to media reports, On the eve of star couple Akshay KumarAkshay Kumar and Twinkle KhannaTwinkle Khanna’s 10th wedding anniversary Ritesh and Genelia made it obvious from their body language that they are pretty comfortable with each other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X