రామ్ చరణ్ 'ఆరెంజ్' షూటింగ్ లో ప్రమాదం
ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం 'ఆరెంజ్' షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాయింత్రం ఆరు గంటలకు మెరైన్ డ్రైవ్ వద్ద ఓ యాక్సెడెంట్ చోటు చేసుకుంది. సముద్రం వద్ద ఉన్న రాళ్ళ దగ్గర సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న షజాన్ పద్మాసి(Shazahn Padamsee) రామ్ చరణ్ మధ్య షాట్ ప్లాన్ చేసి చిత్రీకరిస్తున్నారు. అప్పుడు వచ్చిన ఓ అల వేగంగా ఆమెను తాకటంతో ఆమె పట్టుతప్పి జారింది. రాళ్ళపై పడటంతో దెబ్బలు తగిలాయి. ముందుగా తేరుకున్న భాస్కర్ వెంటనే మెడికల్ ఎయిడ్ ఎరేంజ్ చేసి పాకెప్ చెప్పి ఆమెను కారులో పంపించారు. కాస్సేపటికి ఆ విషయంపై ఆమె స్పందిస్తూ మేం ఊహించని విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది క్షణాల్లో షూటింగ్ పూర్తవతుందనగా ఈ సంఘటన జరిగింది అంది. పెద్దగా దెబ్బలేమీ తగలేదని డాక్టర్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమన్నాడని చెప్పుకొచ్చింది. అలాగే చేతులు, మోకాళ్ళపై దెబ్బలు తగిలాయని తెలిపింది. అలాగే నేను ఆల్ మోస్ట్ సముద్రంలో పడిపోయాననుకున్నానని చెప్పింది. ఇక నాగేంద్రబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక దాదాపు పదిహేను నిముషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ లో ఈ కొత్త హీరోయిన్ షజాన్ పద్మాసి కనపడుతుంది.


Click it and Unblock the Notifications











