‘ఆరెంజ్’ లో కాస్ట్ లీ సీన్స్ ని తొలిగించారా..ఏమైంది డైరెక్టర్ కి...
రామ్ చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆరెంజ్" చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్ననే ఈ'సినిమా" సెన్సార్ పూర్తయ్యింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ లిస్ట్ కన్ ఫార్మ్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆరంభమయ్యింది. మెగా అభిమానులు ఫుల్ స్వింగ్ తో టిక్కెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారట. థియేటర్లు ముందు చరణ్ కటౌట్లకు పువ్వుల డెకరేషన్, థియేటర్స్ ముందు డెకరేషన్ తదితర విషయాలతో మెగా అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారని సమాచారమ్.
కాగా ఈ సినిమాలో బాగా ఖర్చు పెట్టి తీసిన కొన్ని కాస్ట్ లీ సీన్స్ ని దర్శకుడు భాస్కర్ ఎడిటింగ్ లో తొలిగించాడట. ఈ సీన్స్ ఉండటం వల్ల సినిమా లెగ్త్ ఎక్కువవుతుందని భావించే భాస్కర్ ఈ సీన్స్ ని తొలిగించాడని తెలుస్తోంది. బాగా ఖర్చుపెట్టి తీసిన ఈ సీన్స్ ను తొలిగించడం పై దర్శకుడు భాస్కర్ మీద నిర్మాత నాగబాబు ఆగ్రహంగా ఉన్నాడని సమాచారమ్.


Click it and Unblock the Notifications











