‘మగధీర’నే మడతెట్టేస్తాడంట: కత్తి కాంతారావు

By Sindhu

మెగా పవర్ స్టార్" రామ్ చరణ్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు" భాస్కర్ రూపొందిస్తున్న చిత్రం 'ఆరెంజ్' ఆడియో అక్టోబరు 6 న విడుదల కావొచ్చని సమాచారం. ఈ చిత్రంలో చెర్రీ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు జెనీలియా, షాజన్ పదామ్సీ, మధురిమ లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్న నేపధ్యంలో ఆ చిత్ర నిర్మాత కె. నాగబాబు అక్టోబరులో మొదటి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. హ్యారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ గీత రచయిత 'సిరివెన్నెల" సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు.

అయితే 'మగధీర" అనంతరం రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఆరంజ్" చిత్రం నవంబర్ 5న విడుదల కానుందనే ప్రకటన వెలువడిన రెండో రోజే..అల్లరి నరేష్ నటిస్తున్న 'కత్తి కాంతారావు" చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న 'కత్తి కాంతారావు" చిత్రానికి 'ఎవర్నైనా మడతెట్టేస్తాడు" అనేది ట్యాగ్ లైన్ కాబట్టి..మగధీర ను కూడా మడతెట్టేస్తాడా?అనే ఆసక్తికర చర్చ మొదలు కానుంది.

'బెండు అప్పారావు, బెట్టింగ్ బంగార్రాజు", చిత్రాలతో విజయాలందుకున్న అల్లరి నరేష్ కు 'శంభో శివ శంభో", 'ఆకాశరామన్న", 'శుభప్రదం" చిత్రాలు నిరాశపరిచాయి. అయితే...వంశీ దర్శకత్వంలో వచ్చిన 'సరదాగా కాసేపు" ఫర్వాలేదనిపించుకుంటోంది. సంవత్సరానికి అలవోకగా అయిదారు సినిమాల్లో నటిస్తుండే అల్లరి నరేష్ కు నెల విడిచి నెల సినిమా విడుదలవుతూనే ఉంటుంది. సెప్టెంబర్ లో సరదాగా కాసేపు" విడుదలైంది కాబట్టి..అక్టోబర్ వదిలేసి, నవంబర్ లో 'కత్తి కాంతారావు" విడుదల కానుండడంలో విశేషమేమీ లేదు. కాకపోతే రామ్ చరణ్ చిత్రం విడుదలవుతున్న రోజే అల్లరి నరేష్ సినిమా కూడా రిలీజ్ కానుండడం ఒకింత చర్చనీయాంశమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X