చరణ్ ‘ఆరెంజ్’ మూవీ నష్టాలతో నాగబాబు ఆత్మహత్య యోచన, ఆదుకున్న పవన్
టీవీ షోలో ఆయన మాట్లాడుతూ....ఆరెంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయాను. నా జీవితంలో సంపాదించుకున్నదంతా పోగా అప్పులపాలయ్యాను. ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. విషయం తెలుసుకున్న కళ్యాణ్...అప్పుల సంగతి తాను చూసుకుంటానన్నారు. ఆ తర్వాత రోజు అన్నయ్య పిలిచి 'నేనున్నాను అంతా మర్చిపో' అన్నారు.
సినిమా నిర్మాణం అనేది ఒక కళ. దానిపై కమాండ్ ఉన్నప్పుడే అందులో సక్సెస్ అవుతాం. నాకు అంత కమాండ్ లేదనే చెప్పుకోవచ్చు. నటుడిగా, నిర్మాతగా రెండు పడవలపై కాళ్లు పెట్టి దెబ్బతిన్నాను. పరిశ్రమలో అరవింద్ నన్ను తొక్కేస్తున్నారనే టాక్ ఉంది. కానీ అందులో నిజం లేదు అని చెప్పుకొచ్చారు... నాగబాబు.
త్వరలో తన తనయుడు వరుణ్ తేజ్ సినిమాల్లోకి వస్తున్నాడని, 6.4 అడుగుల ఎత్తుతో అందంగా ఉంటాడని, అశ్వినీదత్ నిర్మాతగా ఆ సినిమా రూపొందుతోందని.....త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు నాగబాబు.


Click it and Unblock the Notifications












