అబ్బాయ్ ప్లాపు సినిమాకు...బాబాయ్ మూడో పెళ్లికి లింకు!
హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' చిత్రం చెర్రీ కెరీర్లో పరమ ప్లాపు చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. 'జీవితాంతం ఒకే వ్యక్తితో ప్రేమలో ఉండటం అనేది అబద్దమని, ప్రేమిస్తాను...కానీ ఎంత కాలం ప్రేమిస్తాను అనే విషయంలో గ్యారంటీ ఇవ్వలేను. ప్రేమించినంత కాలం పువ్వుల్లో పెట్టి చేసుకుంటాను' అనేది ఈ చిత్రంలో హీరో చెప్పే కాన్సెప్టు. తాను నమ్మిన ఫిలాసపీని ప్రమోట్ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరితో ప్రేమలో పడుతూ లేస్తూ హ్యాపీగా గడిపిస్తూంటాడు హీరో.
'ఆరెంజ్' కథను కళ్యాణ్ బాబు సెలెక్ట్ చేసాడని అప్పట్లో..... స్వయంగా ఈ చిత్ర నిర్మాత, పవన్ సోదరుడు నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్న నేపథ్యంలో......అరెంజ్ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు పలువురు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో ఆలోచనలు కూడా ఇదే విధంగా ఉన్నాయని....అందుకే 'ఆరెంజ్' సినిమా కాన్సెప్టు తెగ నచ్చేసి పవన్ ఆ కథ ఓకే చేసి ఉండాడని అంటున్నారు.
పవన్ ఈ కథను ఓకే చేయడం మూలంగా.....చరణ్ కెరీర్లో ఓ ప్లాపు చిత్రం నిలువగా, నాగబాబు భారీ నష్టాలపాలయ్యాడు. ఆ నష్టాల నుంచి నాగబాబు ఇప్పటికీ తేరుకోలేదు. తన నిర్ణయం కారణంగా నష్టపోయిన అన్నయ్యను పవన్ కళ్యణ్ ఆర్థికంగా ఆదుకున్నాడు కూడా. మరి బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఆ కథ పవన్ కళ్యాణ్‌పై ప్రభావం చూపిందా? లేక కాకతాళీయంగా 'ఆరెంజ్' కాన్సెప్టు....పవన్ ఆలోచనలు కలిశాయా? అనేది చర్చనీయాంశం అయింది.
పవన్ కళ్యాణ్ తొలుత నందిని అనే అమ్మాయిని 1997లో వివాహం చేసుకున్నారు. ఆమెతో విడిపోయిన పవన్ తన సహ నటి రేణుదేశాయ్‌కు దగ్గరయ్యాడు. 2009లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా సెప్టెంబర్ 30, 2013న విదేశీ భామ అన్నా లెజెనివాను మూడో వివాహం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications












