నైజాం, సీడెడ్ లో ‘ఆరెంజ్’ రికార్డుల మోత...
రామ్ చరణ్ తాజా చిత్రం 'ఆరెంజ్"కి ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో భారీ రేట్లు పెట్టి కొనేస్తున్నారు. 'మగధీర" తర్వాత వెంటవెంటనే రామ్ చరణ్ చేసి చిత్రం కవడంతో 'ఆరెంజ్"కి సూపర్ క్రేజ్ నెలకొంది. కొన్ని ప్రాంతాల వరకు సొంత మనుషుల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మాత నాగబాబు రిలీజ్ చేసుకుంటున్నా అక్కడా టెంప్టింగ్ ఆఫర్స్ తో ఇంకా కొందరు పోటీ పడుతూనే ఉన్నారు.
సీడెడ్, ఈస్ట్, వెస్ట్, గుంటూర్, నెల్లూరు..ఇలా అన్ని ఏరియాల్లో 'ఆరెంజ్" ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డులు నెలకొల్సింది. అయితే ఈ చిత్రానికి ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతూ ఉండడం పట్ల అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరీ క్లాస్ సినిమాలా అనిపిస్తున్న 'ఆరెంజ్" బయ్యర్లకి ఈ రేట్లతో ప్రాఫిటబుల్ వెంఛర్ కావాలంటే సూపర్ హిట్ అయి తీరాలి. అసలే ఈ ఏడాదిలో వచ్చిన మెగా సినిమాలన్నీ కమర్షియల్ డిజాస్టర్స్ కావడంతో 'ఆరంజ్" కూడా అలా కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 'ఆరెంజ్" యూనిట్ మాత్రం ఈ చిత్రం అంచనాలను అందుకుని తీరుతుందని బల్లగుద్ది చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











