»   » రామ్ చరణ్ 'ఆరెంజ్' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే...

రామ్ చరణ్ 'ఆరెంజ్' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆరెంజ్' చిత్రం నెక్ట్స షెడ్యూల్ ముంబాయి లో జరగనుంది. మే 21 నుంచి మే 31 వరకూ పది రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. చిత్రంలో కీలకంగా నిలచే కొన్ని మాంటేజెస్ ని ఇక్కడ తీయనున్నారని సమాచారం. కెమెరామెన్ కిరణ్ రెడ్డి దీనికి సంభందించిన ప్లాన్ చేస్తున్నారు. ఇక మొన్నటి వరకూ ఆస్ట్రేలియాలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. జెనీలియా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.నాగేంద్రబాబు నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు తర్వాత జెనిలియా ఈ చిత్రంలో మరోసారి బాస్కర్ దర్శకత్వంలో చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ఆ రేంజే వేరు అన్న ట్యాగ్ లైన్ పెట్టారు.

'ఆరెంజ్' చిత్రం అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జెనీలియాతో పాటు షజాన్ పదమ్సి, సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. కె.వెంకట్రావు సమర్పించే ఈ చిత్రం దసరా కానుకగా పండగ రోజులు కలిసి వచ్చేటట్లు ఉండాలని నిర్ణయించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ తాజాగ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు.

Please Wait while comments are loading...