రామ్ చరణ్ తేజ్ 'ఆరంజ్’ ఆ రేంజ్‌లో ఉంటుందా?
రామ్ చరణ్ తేజ్ తాజా సినిమాకు ఇప్పటి వరకూ వర్కింగ్ టైటిల్‌గా చలామణిలో ఉన్న 'ఆరంజ్"ను టైటిల్‌గా ఖరారు చేసారు. 'ఓ రేంజ్ లవ్‌స్టోరీ" (0 range love story) అనేది దీనికి ఉపశీర్షిక. 'బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జెనీలియా జంట గా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. 'ఓ రేంజ్ లవ్‌స్టోరీ" అని చాలా ధైర్యంగా ప్రకటించుకుంటున్న ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాల్సిందే మరి! 'మగధీర" అనంతరం రూపొందుతున్న ఈ చిత్రం మంచి రొమాంటిక్ కామిడి చిత్రం, ఈ చిత్రం రామ్‌చరణ్‌తేజ్ కెరీర్‌కు చాలా కీలకం కావడంతో ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో షాజాన్ పదమ్షీ కూడా సపోర్టింగ్ రోల్ చేస్తున్నది. మరియు ఈ చిత్రానికి హరిషీ జయరాజ్ మ్యూజిక్ హైలైట్ అవుతుందని, పీటర్స్ హెయిన్స్ ఫైట్స్ అద్బుతంగా చిత్రీకరించారని సమాచారం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్సెషల్ గా రిలీజ్ చేయడానికి మరింత వేగంగా షూటింగ్ జరుపుకొంటోందని సమాచారం.


Click it and Unblock the Notifications