Samantha Ruth Prabhu సినిమాలకు సమంత బ్రేక్.. అయినా తగ్గని క్రేజ్.. పాన్ ఇండియాలో ర్యాంక్ ఎంతంటే?
హీరోయిన్లలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే చెప్పడం చాలా కష్టమే. ఈ రోజుల్లో టాప్ టెన్ లో పాన్ ఇండియాలో ఎవరు ఉన్నారు అని అడిగితే ఇంకా కష్టమే కదా.. అయితే మనం కష్టపడకుండా ఇలాంటి సర్వేలను ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ మధ్యకాలంలో చేస్తూ వస్తోంది.
తెలుగులో టాప్ టెన్ హీరోలు ఎవరు? టాప్ టెన్ హీరోయిన్లు ఎవరు? అలాగే ఇతర భాషల్లో టాప్ టెన్ హీరోలు ఎవరూ.. హీరోయిన్లు ఎవరు.. ఇలా లిస్టులు వేస్తూ వస్తోంది. ఇక ఈ మీడియా సంస్థ ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా టాప్ టెన్ హీరోయిన్ల లిస్టును కూడా ప్రచురించింది. ఆ వివరాల్లోకి వెళితే...

సినిమాలకు బ్రేక్ అయినా: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉంది. నిజానికి సామ్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో.. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాంటి ఆమె జూన్ నెలలో పాన్ ఇండియాలో హీరోయిన్ల విషయంలో టాప్ లో నిలిచింది. ఇక ఆమె తర్వాతి స్థానంలో ఆలియా భట్ నిలువగా.. మూడో స్థానాన్ని మాత్రం దీపికా పదుకునే దక్కించుకుంది.

టాప్ 4లో నయన్: ఇక నాలుగవ స్థానాన్ని నయనతార దక్కించుకోగా ఐదవ స్థానాన్ని మాత్రం ఈ మధ్యనే ఒక బుడతడికి తల్లైనా.. మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ దక్కించుకుంది. ఇక ఆరవ స్థానాన్ని పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ స్టార్ క్రేజ్ దక్కించుకున్న త్రిష కైవసం చేసుకోక ఆ తరువాత స్థానాన్ని మాత్రం పెళ్లై మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కత్రినా కైఫ్ దక్కించుకుంది.

పదో స్థానంలో నేషనల్ క్రష్: ఎనిమిదో స్థానంలో కూడా ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కియారా అద్వాని దక్కించుకోగా... 9వ స్థానాన్ని మాత్రం దక్షిణాదికి చెందిన కీర్తి సురేష్ దక్కించుకుంది. ఆమె ఒక పక్క తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లిస్టులో నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న పదవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అభిమానుల ఆవేదన: ఆమె నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుని ఇప్పుడు ఆ పేరు తగ్గించుకోవడమే వింతగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే ఈ లిస్టులో మొదటి స్థానాన్ని ఆమె దక్కించుకుంటుందని ఆమె అభిమానులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ వారికి ఇప్పుడు నిరాశ ఎదురవుతూనే వస్తోంది. జూన్ నెలకుగాను సమంత మొదటి స్థానాన్ని తగ్గించుకుంటే.. రష్మిక మందన్న మాత్రం చివరి స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
దక్షిణ హీరోయిన్స్ హవా: ఇక వీరంతా లిస్టులో స్థానం సంపాదించుకోగా ఇండియా వైడ్ గా ఉన్న మిగతా హీరోయిన్లు ఎవరూ ఈ లిస్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. ఆయా హీరోయిన్ల అభిమానులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇంగ్లీషులో ఆరుగురు దక్షిణాది హీరోయిన్ లో ఉండగా కేవలం బాలీవుడ్ నుంచి నలుగురు హీరోయిన్లు ఉండడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్ లో కూడా దక్షిణాది హీరోయిన్ లదే హవా అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











