దీపికా పదుకొణె, రష్మికలకు గట్టి షాకిచ్చిన సమంత - తిరిగి సామ్​కు దెబ్బేసిన అలియా!

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎలా పోటీ వాతావరణం ఉంటుందో అలాగే హీరోయిన్స్ మధ్య కూడా మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వరుస ఆఫర్ల కోసం బాగా శ్రమిస్తుంటారు. ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టినా వారికి ఐరెన్ లెగ్​ అని ముద్ర పడిపోతుంది. అయితే తాజాగా ఆ విషయంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకుకే షాకిచ్చింది హీరోయిన్ సమంత. అయితే సమంతను బీట్​ చేస్తూ షాకిచ్చింది మరో హీరోయిన్​ అలియా భట్. ఇంతకీ ఈ మ్యాటర్​ ఏంటో పూర్తిగా స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే..ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి మూవీ లవర్స్​కు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి వారం లేదా ప్రతి నెల దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ దక్కించుకున్న సినీ తారలు, సినిమాలు, వెబ్​సిరీస్​ల గురించి సర్వేలు చేయించి మరీ ఆ వివరాలను తెలుపుతుంటుంది. అలా తాజాగా ఈ సారి గత నెల ఫిబ్రవరిలో భారీ క్రేజ్ దక్కించుకున్న స్టార్ హీరోయిన్స్ గురించి, వారి స్థానాలకు సంబంధించిన విషయాలను తెలిపింది.

Ormax Media releases Top 10 heroines Samantha Shock to Deepika padukone and National crush Rashmika

ఇందులో వరుస సినిమాలతో హిట్లు కొడుతూ కెరీర్​లో దూసుకుపోతున్న దీపికా పదుకొణె మూడో స్థానానికి వచ్చేసింది. పఠాన్, జవాన్​, ఫైటర్ వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న ఈమెను బీట్​ చేసింది టాలీవుడ్​ హీరోయిన్ సమంత. వాస్తవానికి సమంత సినిమాలు చేసి ఏడాది దాటిపోయింది. అప్పటికీ కూడా వరుస ఫ్లాప్​లతోనే ఉంది. శాకుంతలం, యశోద డిజాస్టర్లుగా నిలవగా ఖుషీ యావరేజ్ అందుకుంది. అయినా కూడా సమంత టాప్​ సకెండ్​ ప్లేస్​లో నిలిచింది.

ఇక విజయ్​ సేతుపతితో కలిసి రీసెంట్​గా మెరీ క్రిస్మస్​లో నటించిన కత్రినా కైఫ్​ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం థియేటర్లలో పర్వాలేదనిపించింది ఓటీటీలో మంచి రెస్పాన్స్​ను అందుకుంది. భగవంత్ కేసరిలో నటించి మంచి హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్​ ఐదో స్థానంలో, జవాన్​తో భారీ బ్లాక్​ బస్టర్ అందుకున్న నయనతార ఆరో ప్లేస్​ను దక్కించుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్​లో పొన్నియన్ సెల్వన్, లియో సహా పలు చిత్రాలతో హిట్లను ఖాితాలో వేసుకున్న త్రిష తన అందంతోనూ యూత్​ను కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఛాన్స్​ కొట్టేసింది. అయినా ఈమె ఏడో స్థానంలో నిలిచింది. గేమ్​ ఛేంజర్​లో నటిస్తున్న బ్యూటీ కియారా అద్వాణీ ఎనిమిదో చోటులో నిలిచింది.

యానిమల్ చిత్రంతో భారీ పాన్ ఇండియా సక్సెస్​ను దక్కించుకున్న నేషనల్ క్రష్​ రష్మికకు మాత్రం చిన్ షాక్ తగిలింది. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రంలో నటిస్తున్నప్పటికీ, యానిమల్​తో విజయాన్ని అందుకున్నప్పటికీ తొమ్మిది స్థానంలో పడిపోయింది. ఫైనల్​గా ఆదిపురుష్ ప్రభాస్ బ్యూటీ కృతి సనన్​ పదో స్థానంలో నిలిచింది. అలా మొత్తంగా సౌతిండియా నుంచి సమంత టాప్​ ప్లేస్​లో నిలవగా నార్త్ ఇండియా నుంచి అలయా భట్ అగ్రస్థానం దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X